రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీకి బలమయిన ప్రత్యామ్నాయంగా ఎదుగుతాం అంటున్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో బండి సంజయ్ అనేక అంశాలు ప్రస్తావించారు. రెండేళ్ళ పదవీకాలం చాలా సంతృప్తినిచ్చింది. అందరి సహకారం, నేతల సలహాలతో లక్ష్యాల వైపు అడుగులేశా. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీని అధికారంలోకి తెస్తాం. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో మేం గెలిచాం. టీఆర్ఎస్ డబ్బులు బాగా ఖర్చుపెట్టింది. నియోజకవర్గాలు అన్నింటిలో మేం పోటీచేశాం. మాకు నాయకులు తక్కువ…