Site icon NTV Telugu

Banakacharla : బనకచర్లపై చర్చకు ససేమిరా.. తెలంగాణ ప్రతిపాదనలే ఎజెండాలో చేర్చాలి

Revanth Reddy, Chandrababu

Revanth Reddy, Chandrababu

Banakacharla : రాష్ట్రాల మధ్య జలవివాదాలపై చర్చించేందుకు కేంద్ర జల శక్తి శాఖ ఈనెల 16న ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో బనకచర్లను ఎజెండాగా చేర్చడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బనకచర్లపై చర్చించాల్సిన అవసరం లేనే లేదని, వెంటనే ఎజెండాను సవరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర జలశక్తి కార్యదర్శికి లేఖ రాశారు.

గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఉన్న అభ్యంతరాలన్నింటినీ ప్రభుత్వం ఈ లేఖలో ప్రస్తావించింది. రేపటి సమావేశంలో బనకచర్లపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్ ఎజెండాను కేంద్రానికి పంపించింది. స్పందించిన తెలంగాణ కేంద్రానికి ఈ లేఖ రాసింది. ఇప్పటికే కృష్ణాపై పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు, డిండి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం, తుమ్మడిహెట్టి వద్ద నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఏబీఐపీ సాయం, ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలతో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఎజెండా ప్రతిపాదనలను పంపించింది.

Harry Potter Reboot: హ్యారీ పోట్టర్ రీబూట్ ప్రారంభం.. కొత్త హ్యారీగా ఎవరంటే..?

జీఆర్ఎంబీ, సిడబ్ల్యూసీ, ఈఏసీ నుంచి బనకచర్లపై తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి. ఇప్పటివరకు బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవు. చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులన్నీ ఉల్లంఘించే బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదనే వాదనను ఈ లేఖలో ప్రస్తావించింది. గోదావరి–బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించటం అనుచితమని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని అందులో ప్రస్తావించింది.

ఇప్పటికే ఏపీ సమర్పించిన ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్ ను కేంద్ర పర్యావరణ శాఖ పరిధిలోని ఈఏసీ తిరస్కరించిన విషయాన్ని ఈ లేఖలో ఉటంకించింది. కేంద్ర జల సంఘం కూడా ప్రీ ఫిజిబులిటీ రిపోర్టును తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. డీపీఆర్ సమర్పించకుండా, టెండర్లు పిలవకుండా ఏపీని అడ్డుకోవాలని కోరారు. రెండు రాష్ట్రాల సీఎంల సమావేశంలో గోదావరి–బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చను వాయిదా వేయాలని, తెలంగాణ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను అజెండాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.

Shubanshu Shukla: Axiom-4 మిషన్ విజయవంతం.. సేఫ్ ల్యాండింగైన శుభాంశు శుక్లా అండ్ టీం..!

Exit mobile version