Balkampet Temple: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం వైభవంగా కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 9.30 గంటలకు ఈ కల్యాణోత్సవం ప్రారంభమైంది. ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని ప్రజలు టీవీల్లో చూసేందుకు ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకునే భక్తులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం ఆషాడమాసం మొదటి మంగళవారం బల్కంపేటలో ఎల్లమ్మ మాతృ కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కల్యాణానికి ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా పట్టువస్త్రాలు సమర్పించారు. కాగా, అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కల్యాణోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
Read also: Telangana University: తెలంగాణ వర్సిటీలో ఏసీబీ దూకుడు.. నియామకాల్లో అక్రమాలపై విచారణ
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో భాగంగా సోమవారం మహాకూటమి నిర్వహించారు. నేడు ఎల్లమ్మ కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. చివరగా రేపు సాయంత్రం రథోత్సవం జరగనుంది. దాంతో అమ్మవారి కల్యాణోత్సవాలు ముగియనున్నాయి. అయితే అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ట్రాఫిక్‌ను మళ్లించారు. దీనికి ప్రయాణికులు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ప్రయాణికులు సహకరించాలని కోరారు.