Site icon NTV Telugu

Balka Suman: కాంగ్రెస్‌ సభపై బాల్క సుమన్‌ సెటైర్లు.. అది మానసిక సంఘర్షణ సభ..!

కొత్త థియేటర్‌లో పాత సినిమా లాగా కాంగ్రెస్ సభ ఉందని టీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. ఆ స‌భ‌ కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ కాదని.. కాంగ్రెస్ పార్టీ ఫ్రస్ట్రెషన్ అని అన్నారు. చావు నోట్లో తలపెట్టి, రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. బైండోవర్ కేసులు పెట్టి నిర్బంధించారని బాల్క సుమన్ పేర్కొన్నారు. పండుగలు కూడా చేసుకోలేదని బాల్క సుమన్ పేర్కొన్నారు.

Read Also: Minister Niranjan Reddy: టీఆర్ఎస్‌ను క్షమించం అనేందుకు రాహుల్‌ ఎవరు..?

చంద్రబాబుకు ఏజెంట్‌గా ఉన్న రేవంత్ రెడ్డి రైతుల పక్షాన ఉంటాడట అని ఎద్దేవా చేశారు. స్టేజి మీద ఉన్నోడు ఒక్కడు కూడా తెలంగాణ ఉద్యమంలో లేడన్నారు. బీజేపీ నడ్డా సభలో కూడా ఒక్కడు కూడా ఉద్యమంలో లేడన్నారు. బండి సంజయ్‌పై తెలంగాణ ఉద్యమంలో ఒక్క కేసైన ఉందా? అని ప్రశ్నించారు. ధర్మపురి అరవింద్ ఎవడికి తెలుసని అన్నారు. నిజానికి కాంగ్రెస్ సభ.. మానసిక సంఘర్షణ సభ లాగా ఉందని టీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అన్నారు.

Exit mobile version