హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణం, ఎంపి ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా వారియర్స్ యువజన సమ్మేళనం కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ప్రభుత్వ విప్ భాల్క సుమన్ హాజరయ్యారు. ఈ సందర్బంగా బాల్క సుమన్ మాట్లాడుతూ… ఆనాడే కమలాపూర్ నియోజకవర్గ టీఆరెస్ కంచు కోట. 2004లో ఎమ్మెల్యే గా ఈటలకు అవకాశం ఇచ్చారు. ఆరు సార్లు పార్టీ బీఫామ్ ఇచ్చి ఆరు సార్లు ఎమ్మెల్యే గా, రెండు సార్లు మంత్రి పదవి ఇచ్చారు కేసీఆర్. ఆయన 19 సంవత్సరాలు ఒక పెద్ద కొడుకుగా రాజేందరన్నను చూసాడు. రాజేందరన్నకు కేసీఆర్ ఇచ్చినన్నీ అవకాశాలు ఎవ్వరికీ ఇవ్వలేదు. మాములుగా కోళ్ల ఫామ్ నడుపుకునే రాజేందరన్న ను రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంచారు.
కానీ శత్రువులతో చేతులు కలిపి రాష్ట్రాన్ని పార్టీని విచ్ఛిన్నం చేసే కుట్ర చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ వ్యక్తులకు కాకుండా వేరే పార్టీకి మద్దతు ఇచ్చాడు. ప్రభుత్వ సిబ్బందిని వాహనాలను వదిలివేసి సొంత కారులో వెళ్లి రహాస్య మీటింగ్ లు పెట్టాడు ఈటల రాజేందరన్న. క్యాబినెట్ లో జరిగిన విషయాలను బయటకు వచ్చి రెవెన్యూ లీడర్ లకు లీకులు ఇచ్చాడు. రైతు బంధు పధకాన్ని ఇక్కడే నుండే ప్రారంభించారు. ఆలాంటి పథకాన్ని పరిగేరుకున్నట్టు ఉన్నాయని మంత్రి పదవిలో ఉండి మాట్లాడారు ఈటల. ఐదు సంవత్సరాలు కేసీఆర్ తొ నీకు గ్యాబ్ వచ్చిన కూడా కేసీఆర్ ఏమనలేదు. అయిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని ఎవరు అడగలేదు నీకు నువ్వే రాజీనామా చేశావ్ అని అన్నారు.