Site icon NTV Telugu

Balka Suman: బీజేపీ నేతల నోటిని ఫినాయిల్‌తో కడగాలి

బీజేపీ నేతలపై మండిపడ్డారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్. నిన్న మొన్న రాష్ట్రంలో కొత్త బిచ్చగాళ్ళు తెలంగాణ ప్రజలపై అపారమైన ప్రేమను ఒలకబోస్తున్నారు. బీజేపీ లేకుంటే తెలంగాణ వచ్చేదా అని బండి సంజయ్ మాట్లాడుతున్నాడు. తెలంగాణ ను మోసం చేసిన చరిత్ర బీజేపీ ది. మూడు చిన్న రాష్ట్రాలు ఇచ్చినప్పుడే తెలంగాణ ఇచ్చి ఉంటే 2000 సంవత్సరంలో ఇన్ని బలిదానాలు అయ్యేవా అన్నారు.

బీజేపీ అవకాశవాద రాజకీయాల వల్లే తెలంగాణ కు చాలా నష్టం జరిగింది. తెలంగాణ ఉద్యమం గురించి తెలియని వాడు తెలంగాణ గురించి మాట్లాడటం విడ్డూరం. హంద్రీనీవాకు హారతులు పట్టి, ఆంధ్రకు నీళ్లు మళ్లించిన ఆంధ్ర నాయకులకు ఊడిగం చేసిన డీకే అరుణ ను పక్కన బెట్టుకొని మాట్లాడుతున్నాడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పచ్చి ఆబద్దాలు మాట్లాడుతున్నాడు. గుజరాతి నాయకుల గులాంలు తెలంగాణ నాయకులు అన్నారు.

తెలంగాణ కోసం అందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే పారిపోయిన ద్రోహి నువ్వు. తెలంగాణ పై మీది సవతి తల్లి ప్రేమ..తెలంగాణ లో మాకు అన్ని నియోజకవర్గాలు సమానం. బీజేపీ నాయకుల నోటిని ఫినాయిల్ తో కడగాలన్నారు. కేటీఆర్ నీ వెంట్రుకలు ఇవ్వు అంటున్నావు హైదరాబాద్ వస్తున్నాడు కదా రాహుల్ గాంధీ వెంట్రుకలు ఇవ్వమను ముందు అన్నారు బాల్క సుమన్. తెలంగాణ ఉద్యమంలో తుపాకులు పట్టుకొని తిరిగిన చరిత్ర నీదన్నారు.

Read Also:LIVE: కేసీఆర్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ

Exit mobile version