రచ్చ దేనికి..? కేసీఆర్ డిమాండ్‌పై చర్చ పెట్టాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర బడ్జెట్‌పై విమర్శలు గుప్పించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇదే సమయంలో భారత రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద రచ్చగా మారాయి.. అయితే, కేసీఆర్ వ్యాఖ్యలపై ఆందోళన దేనికి అని ప్రశ్నించారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్.. దేశానికి ఏం కావాలో అది కేసీఆర్ చెప్పారన్న ఆయన.. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు దేశాన్ని అర్థం చేసుకోవడంలో విఫలం అయ్యాయని విమర్శించారు.. ఇక, దేశానికి కొత్త రాజ్యాంగం అవసరం అని మాత్రమే సీఎం కేసీఆర్ అన్నారని.. కేసీఆర్ మాట్లాడిన తెళ్లారికే రాజ్యాంగం మారిపోయినట్టు కాచుకు కూర్చున్నారంటూ మండిపడ్డారు.. కేసీఆర్ ఆలోచన సమాజం ముందు పెట్టారు.. దానిపై చర్చ పెట్టాలి.. కానీ, ఆందోళనలు ఎందుకు అని అని ప్రశ్నించారు.
Read Also: బీజేపీ వైపు తుపాకీ పెట్టి.. కాంగ్రెస్ పార్టీపై కాల్పులు..!
Also Read
- Telangana Govt: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. బకాయిల సొమ్ము రూ.6 వేల కొట్లు విడుదల..
- Metro Express: కరీంనగర్లో 'సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్' బస్సులు ప్రారంభం.. ఈ రూట్లల్లో అందుబాటులోకి..
- Drugs: డ్రగ్స్ సొమ్ముతో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు.. దర్యాప్తు వేగవంతం చేసిన ఈడీ..
- Anganwadi Recruitment: అంగన్వాడీ ఉద్యోగాల నియామకం.. ఆ జిల్లాలకు మంత్రి సీతక్క డెడ్‌లైన్..
ఇక, కేసీఆర్ ఆలోచనపై చర్చ చేయడం ఇష్టం లేని వాళ్లు, చర్చ పక్కదోవ పట్టించే చిల్లర ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు బాల్క సుమన్.. మారిన పరిస్థితుల నేపథ్యంలో చర్చ చేయాలి, డైనమిక్ గా ఉండాలన్నారు. 105 సార్లు రాజ్యాంగ సవరణ చేసింది బీజేపీ..కాంగ్రెస్ కాదా..? అని ప్రశ్నించిన ఆయన.. అంబేద్కర్ విధానం అమలుకు నోచుకోక దళితుల మీద దాడులు చేస్తుంది బీజేపీ కాదా..? అని మండిపడ్డారు.. కేసీఆర్ చర్చ పెట్టిన వెంటనే రాజ్యాంగం మారిందా? అని ప్రశ్నించిన బాల్క సుమన్.. రాజ్యాంగ ఫలాలు పేదలకు అందకపోతే నేనే రాజ్యాంగం తగలబెడ్త అని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యసభలో చెప్పిన మాటలు వినాలని సూచించారు.. ఇక, రాజ్యాంగం సమీక్ష చేయాలని కమిషన్ వేసింది బీజేపీ… సావర్కర్, గాడ్సే వారసులు.. ఎస్సీ అట్రాసిటీ కేసులకు అమైండ్ మెంట్ చేసింది బీజేపీ కాదా..? అని నిలదీశారు బాల్క సుమన్.
- Tags
- Balka Suman
- bjp
- cm kcr
- telangana
- TRS
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్‌గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
-
ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
-
Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
-
Rishab Shetty: రామాయణ ట్రైలర్‌కి ఫిదా అయిన రిషబ్ శెట్టి.. ఏం అన్నారంటే!
-
Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్‌కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్‌లో కొత్త ట్విస్ట్.. లాంచ్‌కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!