Balapur Police Arrested 3 Chain Snatching Thieves: హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచింగ్ దొంగలు ఎలా రెచ్చిపోతున్నారో అందరూ చూస్తూనే ఉన్నాం. ఈజీ మనీకి అలవాటు పడిన యువకులు.. చైన్ స్నాచింగ్ దొంగతనాలే పనిగా పెట్టుకున్నారు. ఇప్పుడు మరో ముఠాని కూడా పోలీసులు పట్టుకున్నారు. చైన్ స్నాచింగ్‌తో పాటు ఇతర దొంగతనాలకు పాల్పడుతూ.. పోలీసులకు చిక్కకుండా సవాల్ విసురుతున్న ముగ్గురు దొంగలను.. ఎట్టకేలకు బాలాపూర్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 16 తులాల బంగారం, రెండు పల్సర్ బైక్‌లు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Ponnam Prabhakar: అసంతృప్తిలో పొన్నం ప్రభాకర్.. కారణం అదే!
బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న సయ్యద్ ఖాజా, అతని బామ్మర్ది షేక్ ఆరిఫ్, మరో చిన్న బామ్మర్ది చెడు అలవాట్లకు బానిసలయ్యారు. చిల్లర పనులు చేస్తూ తిరిగే ఈ ఇద్దరు.. చైన్ స్నాచింగ్, దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. నెలకు ఒక దొంగతనం చొప్పు.. మొత్తం 21 దొంగతనాలకు వీళ్లు పాల్పడ్డారు. తరచూ కాకుండా నెలకోసారి పక్కా ప్లానింగ్‌తో వీళ్లు దొంగతనాలు చేస్తుండటంతో.. పోలీసులు వీరిని పసిగట్టలేకపోయారు. వీరిని పట్టుకోవడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది. వీళ్లు బిస్మిల్లా కాలనీ, వెంకటాపూర్, క్యుబా కాలనీ, అబ్దుల్లా నగర్ కాలనీల్లో చోరీలు చేశారు. వీరిలో ప్రధాన నిందితుడైతన సయ్యద్ ఖాజా తొలుత ఉదయం వేళలో రెక్కీ నిర్వహిస్తాడు. తర్వాత రాత్రి వేళల్లో తన బామ్మర్దులతో కలిసి.. దొంగతనాలకు పాల్పడుతాడు. ఇలా దొంగలించిన సొమ్మంతా ఈదీ బజార్‌లో ఉండే సిరాజుద్దీన్ అనే వ్యక్తికి విక్రయిస్తారు.
Extramarital Affair: భర్త ఇంట్లో ఉండగానే.. ప్రియుడ్ని ఇంటికి పిలిపించి..
మరోవైపు.. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ దొంగల్ని పట్టుకోవాలని పోలీసులు కేసుని సీరియస్‌గా తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే దొంగల్ని గుర్తించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్లు దొంగలించిన వస్తువుల్ని స్వాధీనం చేసుకొని, వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాలనీల్లో ప్రతి ఒక్కరు సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవాలని సూచించారు. ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానంగా కనిపిస్తే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. విలువైన వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోవాలని సలహా ఇచ్చారు.