Site icon NTV Telugu

Badrachalam: రాములోరి కల్యాణానికి ముహూర్తం ఖరారు

దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి గాంచిన భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు బ్రహ్మోత్సవాల షెడ్యూల్‌ను ఆలయ అధికారులు విడుదల చేశారు. ఏప్రిల్ 2 నుంచి 16 వరకు వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించింది. ఏప్రిల్ 10న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

ఏప్రిల్ 2న ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణం, తిరువీధి సేవలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 6న ఉత్సవ మూర్తులకు విశేష స్నపనం, ఉత్సవ అంకురార్పణ, 8న అగ్నిప్రతిష్ట, 9న ఎదుర్కోలు ఉత్సవం, ఏప్రిల్ 11న శ్రీరామచంద్ర స్వామి పట్టాభిషేకం నిర్వహించనున్నారు. కోవిడ్ ఆంక్షలను ప్రభుత్వం సడలించడంతో మిథిలా స్టేడియంలో వేలాది మంది భక్తుల సమక్షంలో శ్రీరామనవమి వేడుకలు జరపాలని కమిటీ నిర్ణయం తీసుకుంది.

Exit mobile version