TG DGP Sivadhar Reddy: 32 ఏళ్ల పోలీస్ సేవకు గౌరవ వందనం.. డీజీపీ శివధర్ రెడ్డికి వీడ్కోలు
- తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు దీర్ఘకాలం సేవ చేసిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి. శివధర్ రెడ్డి
- RBVRR తెలంగాణ పోలీస్ అకాడమీలోని సెరిమోనియల్ పరేడ్ గ్రౌండ్లో గౌరవ వీడ్కోలు పరేడ్
- పోలీస్ అధికారులు, సిబ్బంది శివధర్ రెడ్డికి గౌరవ వందనం సమర్పించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు దీర్ఘకాలం సేవ చేసిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి. శివధర్ రెడ్డి, ఐపీఎస్ పదవీ విరమణ సందర్భంగా RBVRR తెలంగాణ పోలీస్ అకాడమీలోని సెరిమోనియల్ పరేడ్ గ్రౌండ్లో గౌరవ వీడ్కోలు పరేడ్ నిర్వహించారు. ఏప్రిల్ 30, 2026న జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నూతన డీజీపీ సి.వి. ఆనంద్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిష్టా, పలువురు ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది శివధర్ రెడ్డికి గౌరవ వందనం సమర్పించారు.
ఈ సందర్భంగా శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. 32 ఏళ్ల పోలీస్ సేవా జీవితంలో అనేక సవాళ్లు, ఆనందాలు, అనుభవాలు, జ్ఞాపకాలతో ప్రయాణం చేశానని శివధర్ రెడ్డి తన వీడ్కోలు ప్రసంగంలో తెలిపారు. “నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు” అని అన్నారు. 1970-80లలో ఉన్న పోలీసింగ్ పరిస్థితులతో పోల్చితే ప్రస్తుతం పోలీసింగ్‌లో చాలా మార్పులు వచ్చాయని, ఇప్పుడు పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు.
Also Read
తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులపై “తెలంగాణ భావాన్ని అణచివేశారు” అనే అపవాదు ఉందని, ఆ దూరాన్ని తగ్గించి ప్రజలు-పోలీసుల మధ్య సాన్నిహిత్యం పెంపొందించడానికి సిటిజన్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేశామని చెప్పారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఈ విధానాన్ని నడిపించామని, భవిష్యత్తుకు సిద్ధమైన (ఫ్యూచర్ రెడీ) పోలీస్ శాఖను తయారు చేశామని తెలిపారు. తన స్వరాష్ట్రానికి డీజీపీగా నియమించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో కీలక బాధ్యతలు అప్పగించినందుకు సీఎంకి ధన్యవాదాలు చెప్పారు. తన గురువులు, సీనియర్లు, సహచరులు, కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. “సమిష్టి కృషి వల్లే ఈ స్థాయికి రాగలిగాను” అని అన్నారు. యువ పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ శాఖకు మంచి పేరు తెచ్చేలా పని చేయాలని సూచించారు. పోలీస్ శక్తి అంటే గౌరవంగా జీవించడమేనని గుర్తు చేశారు.
నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సి.వి. ఆనంద్ వారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. “మంచి చాలెంజింగ్ అధికారి రాబోతున్నారు” అని శివధర్ రెడ్డి అన్నారు. ఈ వీడ్కోలు కార్యక్రమం తెలంగాణ పోలీస్ శాఖలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. శివధర్ రెడ్డి 32 ఏళ్ల సేవలో ప్రజా సేవ, సవాళ్లు, ఆధునిక పోలీసింగ్‌కు చేసిన కృషి ఎన్నో మందికి స్ఫూర్తిగా నిలుస్తాయి.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!