Site icon NTV Telugu

Financial Hrassment: ఫైనాన్స్‌ కంపెనీ వేధింపులు.. ఓవ్యక్తి సూసైడ్‌ వీడియో వైరల్

Financial Hrassment

Financial Hrassment

Financial Hrassment: ఫైనాన్స్‌ కంపెనీ వేధింపులు తాళలేక ఓవ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌ కుల్సుంపురలో చోటుచేసుకుంది. మహ్మద్‌ నిజాముద్దీన్‌ ఆటో డ్రైవర్‌ ఆరు నెలల నుంచి ఉద్యోగం లేక, రెండు నెలల నుంచి ఈఎమ్‌ఐ చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఇంతలోనే ఓ ప్రముఖ కంపెనీ నుంచి అతను ఈఎమ్‌ఐ ద్వారా రెండు ఫోన్‌లను కొనుగోలు చేశాడు. అన్ని ఈఎమ్‌ఐలలను చెల్లించాడు. కానీ ఇంకా రూ. 4000 చెల్లించాల్సి ఉంది.

అయితే ఈ మొత్తాన్ని చెల్లించడంలో ఇబ్బంది పడడంతో.. సదరు ఫైనాన్స్‌ కంపెనీకి చెందిన వారు నిజాముద్దీన్‌ ఇంటికి వచ్చి వేధించడం ప్రారంభించారు. దీంతో ఇరుగుపొరుగు వారు చూడటంతో అవమానం భరించలేక నిజాముద్దీన్‌.. ఫైనాన్స్‌ కంపెనీ వేధింపులను భరించలేకపోతున్నాన అంటూ, తన చావుకు ఫైనాన్స్‌ కంపెనీ వేధింపులే కారణమంటూ సెల్ఫీ వీడియో తీసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సెల్ఫీ వీడియో ఆధారంగా, మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కుల్సుంపుర పోలీసులు విచారణ చేపట్టారు. నిజాముద్దీన్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించిన పోలీసులు.
AP CM Jagan Avanigadda Tour Live: సీఎం జగన్ భారీ బహిరంగసభ

Exit mobile version