NTV Telugu Site icon

KTR: తెలంగాణలో మరో భారీ పెట్టుబడి.. సంతోషం వ్యక్తం చేసిన ఐటీ మంత్రి..

Ktr

Ktr

ఓవైపు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల భర్తీపై ఫోకస్‌ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. మరోవైపు ప్రైవేట్‌ రంగంలోనూ పెట్టుబడులు ఆకర్షించడంపై దృష్టిసారించింది.. ఇప్పటికే పలు మార్లు విదేశాల్లో తిరుగుతూ పెట్టుబడులను ఆహ్వానిస్తూ వచ్చారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. తాజాగా, రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు మరో సంస్థ ముందుకు వచ్చింది.. అట్టారో ఇండియా కంపెనీ తెలంగాణ‌లో భారీ పెట్టుబ‌డి పెట్టేందుకు ముందుకు వచ్చిందనే విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడిస్తూ.. సంతోషాన్ని వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్.. అట్టారో ఇండియా కంపెనీ రాష్ట్రంలో రూ. 600 కోట్ల భారీ పెట్టుబ‌డి పెట్టబోతోంది.. ఈ విష‌యాన్ని ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాన‌ని పేర్కొంటూ.. అట్టారో ఇండియా కంపెనీ ప్రతినిధుల బృందంతో జరిగిన సమావేశం, చర్చలు, ఒప్పంద పత్రాలపై సంతకాలు, ఆ సంస్థ ప్రతినిధులను తాను చేసిన సత్కారానికి సంబంధించిన ఫొటోలను షేర్‌ చేశారు కేటీఆర్.. ఇక, ఈ పెట్టుబ‌డి ద్వారా 300 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి లభించనుండగా.. ప‌రోక్షంగా చాలా మంది ఉపాధి లభిస్తుందంటూ రాసుకొచ్చారు. కాగా, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు క్యూ కడుతోన్న విషయం తెలిసిందే.

Read Also: Munugode bypoll: రేపే మునుగోడులో ప్రచారానికి తెర.. ఔటర్స్‌ ఖాళీ చేయాల్సిందే..

Show comments