NTV Telugu Site icon

Warangal Crime : వరంగల్ లో కలకలం.. పత్తిమిల్లు యజమాని ఆత్యహత్యాయత్నం

Warangal

Warangal

వరంగల్ జిల్లా కలెక్టరేట్ వ‌ద్ద లో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం చోటుచేసుకుంది. గ్రీవెన్స్ సెల్ లో కలెక్టర్ ఎదుట రఘురాం అనే పత్తి మిల్లు యజమాని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే యత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు.

అనంత‌రం రఘురాం మాట్లాడుతూ.. పత్తి మిల్లు నడవాలంటే లంచం డిమాండ్ చేస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఇదివరకు గ్రీవెన్స్ సెల్ లో ఫిర్యాదు చేసిన స్పందించ‌లేద‌ని అన్నాడు. దిక్కుతోచ‌ని స్థితిలోనే ఈ ఘాతుకానికి ఒడిగ‌ట్టాన‌ని వాపోయాడు. మరోసారి గ్రీవెన్ సెల్ కు వచ్చిన అధికారులు స్పందించ‌క‌పోవ‌డంతో.. ఆత్మహత్యకు యత్నించిన రఘురాం క‌న్నీరుమున్నీరు అయ్యాడు.

ఇదివరకు 45 వేలు లంచంగా ఇచ్చానని రఘురాం చెప్పుకొచ్చాడు. బేల్ కు 50 వేల చొప్పున ఇవ్వాలని, కాటన్ సెక్షన్ అధ్యక్ష కార్యదర్శులు డిమాండ్ చేస్తున్నారని ర‌ఘురాం ఆరోపించాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో తన మిల్లుకు పత్తి కేటాయించడం లేదని ఆందోళన వ్య‌క్తం చేశాడు. తను డ‌బ్బులు ఇచ్చే ప‌రిస్థితుల్లో లేన‌ని అధికారుల‌ను వేడుకున్నా స్పందించ‌లేద‌ని వాపోయాడు. ఇప్ప‌టికైనా అధికారులు స్పందించి త‌న ప‌త్తి మిల్లును న‌డుపుకునేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరారుడు. త‌న‌కు త‌గిన న్యాయం చేయాల‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

IPL 2022: స్వదేశానికి హిట్‌మెయిర్.. రాజస్థాన్‌కు ఎదురుదెబ్బ