NTV Telugu Site icon

హైదరాబాద్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. గొంతు, చేతులు, మనికట్టు కోసి..!

హైదరాబాద్‌లో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు… ప్రేమకు నిరాకరించిన యువతిపై విచక్షణారహితంగా దాడి చేసినట్టుగా చెబుతున్నారు.. యువతి ఇంట్లోకి చొరబడి.. అమ్మాయి గొంతు, చేతులు, వెళ్లు, కాళ్లు, మనికట్టు ఇలా.. చాలా చోట్ల గాయపరిచాడు.. గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

వట్టి నాగులపల్లిలో యువతి పై యువకుడి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.. యువతి ఇంటికి వచ్చి దాడి చేశాడు ప్రేమ్ సింగ్ అనే యువకుడు.. గొంతు, చేతులు, వెళ్లు, కాళ్లు.. ఇలా యువతిపై శరీరంపై చాలా చోట్ల గాయపరిచాడు.. యువతి కేకలు వేయడంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు, స్థానికులు.. యువకుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.. గాయాలపాలైన యువతిని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.. ఇక, స్థానికులదాడిలో గాయపడ్డ ప్రేమ్ సింగ్‌ను ఆస్పత్రికి తరలించారు పోలీసులు.. తాగిన మైకంలోనే ప్రేమ్‌సింగ్‌ హత్యాయత్నానికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు.. సదరు యువతి, ప్రేమ్‌ సింగ్‌ ఇద్దరూ సమీప బంధువులుగా గుర్తించారు.. ఇక, తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.