NTV Telugu Site icon

Attack on Police: శామీర్ పేట్, అల్వాల్ పోలీసులపై దాడి.. బొమ్మలరామారంలో ఘటన

Traffic Police Bommala Ramaram

Traffic Police Bommala Ramaram

Attack on Police: అన్యాయం జరిగితే చాలు ఎక్కడైనా ఎప్పుడైనా ఎన్ని అవాంతరాలు వచ్చిన సరే అక్క ఒక్కక్షనంలో హాజరవుతారు పోలీసులు. అలాంటి పోలీసులపై స్థానికులు తిరగబడితే పరిస్థితి ఏంటి. దాడులు జరిగితే పోలీసులు అడ్డుకుని ఇరుపక్షలవారిని శాంతిపజేస్తారు. అలాంటిది పోలీసులపై రాళ్లు కర్రలతో దాడి చేయడంతో చర్చకు దారి తీస్తోంది. ఈ ఘటన యాదాద్రి జిల్లా బొమ్మలరామారంలో చోటుచేసుకుంది.

Read also: Female Guise: ట్రెండ్‌ మార్చిన దొంగలు.. ఆడవేషంలో దొంగతనాలు

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామరం తండాలో పోలీస్ లపై దాడి తీవ్ర కలకలం రేపింది. శామీర్ పేట వైన్ షాపు కాల్పుల నిందితులను పట్టుకునేందుకు పోలీసులు వెళ్లారు. తండాలో ఒక వ్యక్తి విచారించేందుకు ఉదయం వెళ్లడంతో స్థానికులు వారిపై తిరగపడ్డారు. కాసేపు పోలీసులకు ఏమీ అర్థంకాలేదు. పోలీసులపై ఒకరిపై ఒకరు గుంపుగా చేరి దాడి చేయడంతో.. పోలీసులు పరుగులు పెట్టారు. అయినా స్థానికులు వదలలేదు. తీవ్రంగా గాయపరచాడు. తండా వాసుల దాడిలో ఇద్దరు ఇన్స్పెక్టర్ లకు, నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. తండా వసూలు రాళ్లు కర్రలతో దాడి చేశారు. దాడి చేస్తున్న విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి ఎంపీపీ వెళ్లారు. హుటా హుటిన ఘటనా స్థలికి చేరుకుని గాయపడ్డ పోలీసులని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించిన అధికారులు. ఉద్దేమర్రి వైన్స్ కాల్పుల ఘటనలో తండా వ్యక్తి విచారణ కోసం వెళ్లిన శమిర్ పేట్, అల్వాల్ పోలీసుల పైన దాడి చేసినట్లు తెలిపారు. అనుమానిత వ్యక్తిని విచారణ చేస్తున్న సమయంలో దాడి చేశారని తెలిపారు. గాయపడ్డవారు.. అల్వాల్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కిరణ్, శామీర్‌ పేట్‌ ఎస్‌ఐ మునిందర్, మేడ్చల్ ఎస్‌ఐ సత్యనారాయణ, మరొక వ్యక్తి సీసీఎస్‌ ఎస్‌ఐగా గుర్తించారు అధికారులు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలీసులపై ఈవిధంగా దాడి చేయడంతో ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Ariyana Glory: కుండ పట్టుకుని కుర్రాళ్ల కొంపముంచుతున్న అరియానా..