NTV Telugu Site icon

Jangaon: జనగాంలో దారుణం.. మైనర్ బాలికల శరీరంపై కారం చల్లి..

Janagao

Janagao

Atrocity in Janagam: ఇంట్లో నుంచి నగదు దొంగలించారన్న కారణంతో ఇద్దరు బాలికలను ఓ ఇంటి యజమాని, ఆయన కుటుంబసభ్యులు చితకబాదిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామంలో చోటుచేసుకుంది. ఈనెల 3 న ఈ సంఘటన జరిగితే మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Read also: Jailer: రజనీ ర్యాంపేజ్… 500 కోట్లు

చెన్నూరులో మధుకర్ కుటుంబం నివాసం ఉంటుంది. అయితే వారి ఇంట్లో ఇద్దరు అమ్మాయిలను పనిచేయడానికి పెట్టుకున్నారు. రోజు రావడం మధుకర్ ఇంట్లో పనిచేయడం వంటి పనులు చేసుకునేవారు. అయితే 15 రోజలు క్రితం యజమాని మధుకర్ ఇంట్లో రూ.35వేల వరకు డబ్బులు మాయమయ్యాయి. మధుకర్ ఇంట్లో వారు ఆ ఇద్దరి అమ్మాయిలను అడగ్గా డబ్బులు తీయలేదని సమాధానం ఇచ్చారు. అయితే తీవ్ర ఆగ్రహానికి గురైన యజమాని మధుకర్ ఆ ఇద్దరు మైనర్ బాలికపై పైశాచికంగా వ్యవహరించాడు. పంచాయితీ కార్యాలయం వద్ద చెట్టుకు కట్టేసి కళ్ళలో కారం పెట్టి దొంగతం చేశారంటూ వేధించారు. దీంతో వారు లేదు దొంగతనం చేయలేదని, ప్రాధేయపడ్డా కనికరించాలేదు యజమాని. పైగా పంచాయితీ కార్యాలయం వద్ద చెట్టుకు కట్టేసిన అందరూ చూస్తు ఉండిపోయారే తప్పా ఎవరు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. వారిద్దరి శరీరంపై కారం చల్లి చితకబాదారు. ఓ బాలిక తల్లిదండ్రులను సైతం తీవ్రంగా కొట్టారు. స్థానిక సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాలికల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎస్సై శ్రీకాంత్‌ను వివరణ కోరగా సమాచారం మాత్రం తెలిసిందని సమాధానమిచ్చారు. కేసు నమోదు చేసుకున్నామని, దొంగతనం జరిగిందా? లేదా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. అయితే మరికొందరు మైనర్ బాలికలపై ఏంటీ ఈ అరాచకం అని మండిపడుతున్నారు. పోలీసులకు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మైనర్ బాలికలపై ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Instagram Reels: ఇన్‌స్టా రీల్స్‌ మోజు… బండరాళ్ల మధ్య చిక్కుకుని నరకం చూసిన యువకుడు

Show comments