నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై తాజాగా మరో కేసు నమోదైంది. శ్రీరామ్‌నగర్ కాలనీకి చెందిన సామాజిక కార్యకర్త బంగారు సాయి ఫిర్యాదుతో నిజామాబాద్ ఐదో టౌన్ పోలీసులు అరవింద్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. గతేడాది అక్టోబర్ 31న హైదరాబాద్‌లో అట్రాసిటీ చట్టాన్ని కించపరిచేలా అరవింద్ వ్యాఖ్యానించారని.. దళిత సమాజాన్ని కించపరిచేలా మాట్లాడిన ఆయన్ను చట్టప్రకారం శిక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Read Also: జస్టిస్ లక్ష్మణ్ రెడ్డిపై ఆర్జీవీ సెటైర్లు
మరోవైపు మంగళవారం నాడు కూడా ఎంపీ ధర్మపురి అరవింద్‌పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గత ఏడాది నవంబర్ 8న సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బోయిన్‌పల్లికి చెందిన వ్యాపారి కల్యాణ్ సందీప్ ఫిర్యాదు మేరకు ఐపీసీ 504, 55(2), 506 సెక్షన్‌ల కింద ఎంపీ అరవింద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
