Worse in Narsinghi: దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మహిళలపై అత్యాచారాల నివారణకు ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. ఒకప్పుడు రాబడి జరిగింది లక్షల్లో దోచుకున్నారు అనే రోజులు పోయారు. ఇప్పుడు దుండగులు వారి దారి మార్చారు. డబ్బులు నగలతో దోచుకోవడంతోపాటు ఇప్పుడు మహిళలపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే నార్సింగీలో చోటుచేసుకుంది. ఓ వివాహితపై అత్యాచారం నగరం ఉలిక్కి పడేలా చేసింది. దీంతో నగరప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Read also: Taraka Ratna Tatoo: తారకరత్న చేతిపై బాలయ్య ఆటోగ్రాఫ్.. కన్నీరు తెప్పిస్తున్న జ్ఞాపకం
రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో దుండుగులు ఓ వివాహిత మహిళపై అత్యాచారం పోలీసులకు సవాల్ గా మారింది. పీరం చెరువు గ్రామం వద్ద ఓ వివాహిత కనిపించడంతో.. రాబరి గ్యాంగ్ అక్కడకు వచ్చారు. ఆమె ఒక్కటే ఉండడం గమనించి ఆమె వద్ద ఉన్న బంగారాన్ని దొంగతనం చేద్దామనుకున్నారు. కానీ.. ఆమె ఒక్కటే ఉండటం చూసిన రాబరి గ్యాంగ్ ఆమెను అత్యాచారం చేసేందుకు ప్లాన్ వేసారు. ఆమె వద్దకు వెళ్లారు ఎవరూ లేకపోవడంతో.. ఆ వివాహితను బలవంతంగా వివాహితను కారులో ఎక్కించుకొని కిస్మత్ పూర్ వైపు తీసుకెళ్లారు. ఆమెను బెదిరించారు. నోరు తెరిస్తే చంపేస్తామంటూ కారును నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. తన వద్ద వున్న మొబైల్ తీసుకుని స్విచ్ ఆఫ్ చేశారు. ఆమెను బలవంతంగా మద్యం తాగాలని అనడంతో ఆమె ఒప్పుకోలేదు దీంతో దుండగులు నోరు పట్టుకుని మద్యం తాగించారు. మద్యం తాగడంతో వివాహిత మత్తులోకి వెళ్లింది. ఇదే అలుసుగా భావించిన దుండగులు ఆమెపై ఒకరి తరువాత మరొకరు ఆత్యాచారానికి పాల్పడ్డారు.
Read also: Taraka Ratna Tatoo: తారకరత్న చేతిపై బాలయ్య ఆటోగ్రాఫ్.. కన్నీరు తెప్పిస్తున్న జ్ఞాపకం
ఒకే చోట కారు ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుందని ఆ మహిళను చాలా సేపు కారులో తిప్పుతూ ఆత్యాచారం చేశారు. అర్థరాత్రి కావడంతో ఆమహిళను మత్తులోనే ఉండటంతో.. గండిపేట వద్ద వదిలి అక్కడినుంచి జారుకున్నారు. కొన్ని గంటల అనంతరం వివాహిత మత్తులో నుండి కొలుకుంది. తను ఎక్కడ ఉన్నానో కళ్లు తెరిచూసుకుని తన వద్ద వున్న ఫోన్ ఆన్ చేసి తన భర్తకు బాధితురాలు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. దీంతో.. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని లేవలేని స్థితిలో ఉన్న భార్యను భర్త ఇంటికి తీసుకొని వచ్చాడు. కాసేపు తరువాత తనపై జరిగిన ఘోరాన్ని భర్తకు వివరించింది. ఈవిషయాన్ని భర్త నార్సింగీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న నార్సింగీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీ టీవీ ఫూటేజ్ ను పరిశీలిస్తున్నారు.
Ajay Devgn: సర్ మీకు హార్డ్ డిస్క్ మారి… ఖైదీ కాకుండా అఖండ వచ్చినట్లు ఉంది