NTV Telugu Site icon

Atrocious incident: వదినను రోకలిబండతో కొట్టి చంపిన మరిది

Atrocious Incident

Atrocious Incident

Atrocious incident: కుటుంబ కలహాలతో కొందరు కుటుంబంపైనే పగ పెంచుకుని వారినే కడతేర్చేందుకు వెనుకాడటం లేదు. చిన్న చిన్న గొడవలు చిలికి చిలికి గాలివానై చివరకు వారిపై దాడిచేసే పరిస్థితులు ఎదురవుతున్నాయి. నవ్వుతూ మాట్లాడుకునే రోజులు పోయి కుటుంబాన్ని నడిరోడ్డుపై తీసుకువచ్చే రోజులు వచ్చేస్తున్నాయి. చిన్న పాటి విభేదాలు, వారిపై కసిపెంచుకుని దారణంగా దాడి చేసి మరీ చంపేందుకు కూడా వెకుకాడటంలేదు. చివరికి కనిపెంచిన తల్లిదండ్రులను సైతం కాటికి పంపుతున్నారు. ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు, భార్య భర్తల మధ్య సఖ్యత లేకపోవడం, ఒకనొకరు అర్థం చేసుకోలేకపోవడం, స్నేహితుల మధ్య చిచ్చు ఏదో ఒక కారణంతో ఒకరిపై మరొకరు దాడి చేసుకుని ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మరిది.. వదినను రోగలి బండతో కొట్టి చంపిన ఘటన జనగామ జిల్లాలో కలకలం రేపింది.

Read also: Terrible Incident : కొట్టాడు.. తోశాడు.. చెక్కాడు.. చంపాడు

జనగామ జిల్లా కేంద్రంలోని గుండ్లగడ్డలో కుటుంబం నివాసం ఉంటుంది.వారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. కొద్దిరోజులుగా వీరి కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. అన్న భార్య అయిన మాలోతు విజయపై మరిది మోహన్‌ కోపం పెంచుకున్నాడు. అన్న భార్య అయిన వదిన మాలోతు విజయ ఎప్పుడు ఏదో ఒక కారణంతో కుటుంబంతో గొడవకు దిగేది. దీంతో మోహన్‌ వదిన అయిన విజయను సర్దుకుపోవాలని చెప్పిన మళ్లీ మొదటికే రావడంతో విసుగు చెందిన మరిది మోహన్‌ వదిన విజయపై రోకలిబండతో దాడి చేశాడు. ఆమెను రోకలి బండితో గట్టిగా తలపై కొట్టడంతో విజయ కుప్పకూలిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. స్థానిక సమాచారంతో ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మోహన్‌ ను అదుపులో తీసుకున్నారు. కుటుంబ కలహాలే విజయ మృతికి కారణమా? లేక వీరిద్దరి మధ్య ఇంకా ఏమైనా వుందా? అనే కోణంలో విచారణ చేపట్టారు.
GSLV Mark3: నింగిలోకి దూసుకెళ్ళిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం3

Show comments