Atla Bathukamma: బతుకమ్మ.. ఈ పేరు చెప్పగానే తెలంగాణ సాంస్కృతిక వైభవం గుర్తుకు వస్తుంది. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంప్రదాయాలను చాటిచెప్పే పండుగ. తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఏటా ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు గౌరమ్మకు మహిళలు వివిధ రకాలుగా పూజలు చేస్తున్నారు. ప్రతిరోజు వివిధ రకాల ప్రసాదాలు తయారు చేసి గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తూ అందరూ సుఖశాంతులతో ఉండాలని భక్తి శ్రద్దలతో కోరుకుంటారు. పాడి పంటలతో, సంతానంతో సంతోషంగా జీవించాలని వేడుకుంటున్నారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మలతో బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి.
Read also: Anasuya Bharadwaj: అను ఏంటి కొత్త అవతారం..స్టైలిష్ హెయిర్ స్టైల్ తో క్రేజీ లుక్స్..
ఇక నేడు 5వ రోజైన అట్ల బతుకమ్మను మహిళలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఐదవ రోజు అట్ల బతుకమ్మలో భాగంగా అమ్మవారికి ఉప్పుడు బియ్యంతో చేసిన అట్లు, దోశలు నైవేద్యంగా పెడతారు. నానబెట్టిన బియ్యాన్ని గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. బియ్యపు పిండి అట్లను తల్లికి నివేదించి, ఆడపిల్లలకు వాయనంగా ఇస్తారు. అట్ల బతుకమ్మకు తంగేడు పూలు, గునుగు పువ్వులు, కట్ల పూలు, చామంతి పూలు, మందారం, గుమ్మడి పూలు వంటి అందమైన పూలను పేర్చి అందమైన బతుకమ్మలను తయారు చేస్తారు. ఐదవ రోజు మహిళలు 5 ఎత్తుల్లో బతుకమ్మ పేర్చి తెలంగాణ సాంస్కృత ఆట పాటలు పాడుతూ ఘనంగా జరుపుకుంటారు. ఇక సద్దుల బతుకమ్మతో తొమ్మిదో రోజు బతుకమ్మకు పోయి రావమ్మా అంటూ వీడ్కోలు చెప్తారు.
Tongue Colors: మీ నాలుక ఈ రంగుల్లో ఉంటే సంకేతం ఇదే..