KTR Davos Tour: మరో 20 ఏళ్లలో కేటీఆరే దేశ ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో మంత్రి కేటీఆర్ నాయకత్వంలోని తెలంగాణ టీమ్ దూసుకుపోతోంది. కేటీఆర్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ.. పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌కి ఉన్న విజన్‌ను కొనియాడుతూ.. ఏంజెల్ ఇన్వెస్టర్ ఆశా జడేజా మోత్వాని ట్విటర్‌లో ప్రశంసల వర్షం కురిపించారు. రాబోయే 20 ఏళ్లలో ఈ దేశానికి కేటీఆర్ ప్రధాని అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు.
‘‘20 ఏళ్ల తర్వాత కేటీఆర్ భారత్‌కు ప్రధాని అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన, భావ వ్యక్తీకరణ ఉన్న ఇలాంటి యువ నాయకుడ్ని నేను నా జీవితంలో ఇంతవరకూ చూడలేదు. దావోస్‌లో తెలంగాణ టీమ్ దూసుకుపోతోంది. చూస్తుంటే.. కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి బిలియన్ డాలర్ల పెట్టుబడులు తీసుకెళ్లే విధంగా ఉన్నారు. తెలంగాణ టీమ్ నాకు సిలికాన్ వ్యాలీ స్టార్టప్ రోజులు గుర్తుకు తెచ్చాయి’’ అంటూ ఆశా జడేజా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు మంత్రి కేటీఆర్‌తో కలిసి దిగిన ఫోటోను కూడా జత చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు సైతం కేటీఆర్ పనితీరుని, ఆయన విజన్‌ను మెచ్చుకుంటూ.. కామెంట్స్ పెడుతున్నారు.
Also Read
- CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
- OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
- OTR: జనగామ కాంగ్రెస్‌లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
- KTR : పదవుల్లో ఉన్న వారికంటే ప్రజల బలమే గొప్పది.. జెన్-జీకి కేటీఆర్ సెల్యూట్
ఇదిలావుండగా.. దావోస్‌లో తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి దక్కింది. ఆశీర్వాద్ పైప్స్ (Aliaxis) గ్రూప్ తెలంగాణలో రూ.500 కోట్లను పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ పెట్టుబడితో తెలంగాణలో ఏర్పాటు చేయనున్న తయారీ ప్లాంట్ ద్వారా స్టోరేజ్, డిస్ట్రిబ్యూషన్ పైల్స్, ఫిట్టింగ్స్ వంటి ప్లాస్టిక్ ఉత్పత్తులను ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ సీఈవో తెలిపారు. అంతేకాదు.. యూఏఈకి చెందిన లూలూ గ్రూప్ తెలంగాణలో 500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చినట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అటు, ఈ-కామర్స్ సంస్థ ‘మీషో’ తెలంగాణలో ఫెసిలిటీ సెంటర్ పెట్టేందుకు అంగీకరించింది.
20 years from now, don’t be surprised if KTR becomes PM of India. I have never seen a young politician with such clarity of vision and expression. Telangana team is on fire in Davos. They remind me of a silicon valley start up – will likely go back w $billions in future deals. pic.twitter.com/ae1rT8jXwy
— Asha Jadeja Motwani 🇮🇳🇺🇸 (@ashajadeja325) May 23, 2022
తాజావార్తలు
-
Namo Namo Ji Shankara: యూట్యూబ్ ను షేక్ చేస్తున్న శివయ్య పాట.. 8 ఏళ్లైనా అదే జోష్.. 50 కోట్ల వ్యూస్‌తో రికార్డు!
-
Amit Shah: పదవి కంటే దేశం, విద్యార్థులే ముఖ్యమని మరోసారి నిరూపించాం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై అమిత్ షా స్పందన
-
Rajinikanth: ఆత్మకథతో మరో సంచలనం.. రజనీకాంత్ బయోపిక్ ప్లాన్ నిజమేనా?
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Anahat Singh: భారత స్క్వాష్‌లో చరిత్ర సృష్టించిన అనాహత్ సింగ్.. వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ టైటిల్ కైవసం
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్‌ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!