NTV Telugu Site icon

Asaduddin Owaisi: మోడీ డిగ్రీ పట్టాకోసం తాజ్‌మహల్‌ కింద వెతుకుతున్నారు

Asaduddin Owaisi

Asaduddin Owaisi

ప్రధాని మోడీ.. తాజ్ మహల్ కింద డిగ్రీ పట్టాకోసం వెతుకుతున్నారని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఎద్దేవ చేశారు. భారత దేశానికి మొఘలులు వచ్చిన తర్వాతే బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్లు పుట్టుకొచ్చారని చురకలంటించారు. తాజ్‌మహల్‌ నిజానికి ఒక శివాలయమని, అందులో మూసి ఉన్న 22 గదుల్లో ఏముందో వెళికి తీయాలని బీజేపీకి చెందిన ఓ నాయకుడు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

అయితే ఆ విషయాన్ని చరిత్రకారులకే వదిలేద్దామని.. అలహాబాద్‌ హైకోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచింది. మహారాష్ట్రలోని భీవండిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న అసదుద్దీన్‌.. తాజ్‌మహల్‌ వివాదంపై మాట్లాడుతూ అక్కడ మోదీ డిగ్రీ పట్టా ఏమైనా దొరుకుతుందేమో వాళ్లు వెతుకుతున్నారని ఎద్దేవా చేశారు.

మొఘలులు భారత్‌కు వలస వచ్చారని అంటారు. కానీ చాలా మతాల వారు ప్రపంచం నలుమూల నుంచి ఇక్కడి వచ్చి స్థిరపడ్డారని చెప్పారు. ‘భారత దేశం నాది కాదు, థాక్రేది కాదు. మోదీ-షాలది అంతకంటే కాదు. ఒకవేళ అది ఎవరికైనా చెందుతుందంటే ద్రవిడియన్లు, ఆదివాసీలకు మాత్రమే.

ఎందుకంటే వారుమాత్రమే ఇక్కడ మొదటి నుంచి ఉన్నారు. ఆఫ్రికా, ఇరాన్‌, మధ్య ఆసియా, పశ్చిమాసియా నుంచి ప్రజలు వలస వచ్చిన తర్వాతే భారత దేశంగా ఏర్పడింది. మొఘలలు ఇక్కడికి వచ్చిన తర్వాతే బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ పుట్టుకొచ్చాయి’ అని అసదుద్దీన్‌ చెప్పారు

AKHANDA Silver Jubilee: చిలకలూరిపేటలో బాలయ్య సందడి