Site icon NTV Telugu

AIMIM chief Asaduddin Owaisi: ముస్లింలను బీజేపీ ద్వేషిస్తోంది.. హైదరాబాద్‌ లో అల్లర్లకు కుట్ర

Aimim Chief Asaduddin Owaisi

Aimim Chief Asaduddin Owaisi

బీజేపీ గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మహహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే ఆ వీడియో విడుదల చేశారు. దీంతో భగ్గుమన్న ఎంఐఎం శ్రేణులు ఆందోళనలు తీవ్రతరం చేశారు. రాజాసింగ్ వ్యాఖ్యలను ఖండిస్తూ పాతబస్తీలో ఉదయం చంద్రయాణాగుట్ట పోలీస్ ముందు ఎంఐఎం చంద్రయాణాగుట్ట కార్పొరేటర్లు స్టేషన్లో ఫిర్యాదులు చేసి, స్టేషన్ ఎదుటే నిరసనలు చేపట్టారు. రాజాసింగ్ ను అదుపులో తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

దీంతో పోలీసులు రంగంలోకి దిగి రాజాసింగ్‌ ను అరెస్ట్‌ చేశారు. అయితే.. బీజేపీ గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ లో అల్లర్లకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. 8ఏళ్లుగా తెలంగాణ ప్రశాంతంగా ఉంది.. ముస్లింలను బీజేపీ ద్వేషిస్తోందని మండిపడ్డారు. రాజాసింగ్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రశాంతత లేకుండా వుండేందుకే బీజేపీ ఇలా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌ నగరంలో ప్రశాంతంగా ఉండటం బీజేపీకి ఇష్టం లేదని మండిపడ్డారు.

Exit mobile version