Site icon NTV Telugu

Constable Suicide: హైదరాబాద్‌ లో ARSI బాలేశ్వర్ ఆత్మహత్య.. కుటుంబ సభ్యులు ఏమన్నారంటే..

Conestabul Susaid

Conestabul Susaid

Constable Suicide: పాత బస్తీ కబూ తర్ ఖానాలో విధులు నిర్వహిస్తున్న రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎస్‌ఎల్‌ఆర్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హుస్సేనీ హలం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

Read also: Arvind Kejriwal: కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా నేడు ఆప్ దీక్ష..

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చం పేట్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బాలేశ్వర్ మహబూబ్ నగర్ 10వ బెటాలియన్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్. విధుల్లో భాగంగా మహబూబ్ నగర్ 10వ బెటాలియన్ నుంచి బాలేశ్వర్ నిన్న(శనివారం) పాతబస్తీకి వచ్చారు. జామున విధులు నిర్వహిస్తున్న రిజర్వ్ ఎస్ ఐ బాలేశ్వర్ ఆరు నెలలుగా పాతబస్తీలో విధులు నిర్వహిస్తున్న రెండో రోజు విధులకు వచ్చిన తర్వాత ఎస్ ఎల్ ఆర్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండుసార్లు తుపాకీ పేలడంతో అక్కడే ఉన్న మరికొందరు పోలీసులు పరుగులు తీశారు. అక్కడ తలుపులు పగులగొట్టి చూడగా బాలేశ్వర్ విగతజీవిగా కనిపించాడు. వెంటనే డీసీపీ సాయి చైతన్య, చార్మినార్ ఏసీపీలకు సమాచారం అందించారు. దీంతో డీసీపీ, డీసీపీ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Read also: Tillu Square: టిల్లుగాడిపై ప్రశంసలు కురిపించిన రామ్ చరణ్!

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. బాలేశ్వర్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అతనికి భార్య, పిల్లలు ఉన్నారు. హుస్సేని హాల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాలేశ్వర్‌కు ఎలాంటి కుటుంబ కలహాలు ఉన్నాయి? లేక ఇతర సమస్యల వల్ల తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా? ఈ కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. బాలేశ్వర్ మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఉగాది పండుగ రెండు రోజుల్లోనే బాలేశ్వర్ ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. పండుగ రోజు సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నా ఉన్నతాధికారులు మంజూరు చేయకపోవడంతో మనస్తాపానికి గురైన బాలేశ్వర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Adilabad Rains: ఆదిలాబాద్‌ లో చిరు జల్లులు.. ఊపిరి పీల్చుకున్న ప్రజలు

అయితే బాలేశ్వర్ సూసైడ్ చేసుకునేంత పిరికివాడు కాదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఫ్యామిలీ గొడవలు లేవు ఆర్దికంగా సెటిల్ అయిన ఫ్యామిలీ అన్నారు. సూసైడ్ కాదని మేము నమ్ముతున్నామన్నారు. గన్ మిస్ ఫైర్ వల్ల జరిగిందనీ అధికారులు మాతో చెప్పారన్నారు. మేము అదే నమ్ముతున్నామన్నారు. అయితే.. మీడియా మాధ్యమాల్లో సూసైడ్ అని వస్తుందన్నారు. మిస్ ఫైర్ వల్ల ఘటన జరిగిందని మేము అంటున్నామని పోలీసులు తెలిపారన్నారు. నిన్న రాత్రి కూడా మేము బాలేశ్వార్ తో మాట్లాడామన్నారు. బాగానే మాట్లాడాడు కానీ అంతలోనే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోస్ట్ మార్టం నివేదిక వస్టే తెలుస్తుందని కుటుంబ సభ్యులు తెలిపారు.
Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు షాక్‌.. రాయితీ, హాలిడే కార్డులు రద్దు..

Exit mobile version