NTV Telugu Site icon

కామారెడ్డిలో ఆర్మీ జవాన్ అదృశ్యం..

కామారెడ్డి జిల్లాలో ఆర్మీ జవాన్ అదృశ్యం కలకలం సృష్టిస్తోంది.. కామారెడ్డి మండలం తిమ్మక్‌పల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ కెంగర్ల నవీన్ కుమార్ (28)… గత ఆరు రోజుల క్రితం అదృశ్యం అయ్యాడు.. ఆగస్టు 4వ తేదీన జోధ్‌పూర్ నుంచి సెలవు పైన స్వగ్రామం వచ్చిన జవాన్ నవీన్ కుమార్.. గత నెల 29వ తేదీన అర్ధరాత్రి కామారెడ్డి నుంచి హైదరాబాద్ బయల్దేరాడు.. అయితే, ఆగస్టు 30వ తేదీ నుంచి నవీన్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు.. ఆర్మీ అధికారులకు ఫోన్ చేశారు.. కానీ, జోద్‌పూర్‌కు రాలేడని ఆర్మీ అధికారులు తెలపడంతో.. తెలిసినవారి దగ్గర ఆరా తీశారు.. ఎక్కడా నవీన్‌ కుమార్‌ ఆచూకీ లభించకపోవడంతో… కామారెడ్డి పోలీసులకు కలిసి ఫిర్యాదు చేశారు నవీన్‌ తల్లి మనెమ్మ.. కేసు నమోదు చేసుకున్న కామారెడ్డి టౌన్‌ పోలీసులు.. నవీన్‌ మిస్సింగ్‌పై దర్యాప్తు ప్రారంభించారు.