NTV Telugu Site icon

Cheetah Helicopter Crash: చీతా హెలికాప్టర్​ ఘటన.. యాదాద్రి జిల్లా వాసి మృతి

Cheetah Helicopter Crash

Cheetah Helicopter Crash

Cheetah Helicopter Crash: అరుణాచల్ ప్రదేశ్‌లోని దిరాంగ్ జిల్లాలో నిన్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.. ఈ ప్రమాదంలో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామరం మండలానికి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ ఉప్పల వినయ్ భాను రెడ్డి, ఉప్పల వినయ్ రెడ్డి మృతి చెందారు. లెఫ్టినెంట్ కల్నల్ ఉప్పల వినయ్ భాను రెడ్డి యాదాద్రి జిల్లా వాసిగా అధికారులు వెల్లడించారు. లెఫ్టినెంట్ కల్నల్ ఉప్పల వినయ్ భాను రెడ్డి మృతితో బొమ్మల రామారం గ్రామంలో విషాదం నెలకొంది. హెలికాప్టర్ ప్రమాదంలో సైన్యంలో ఉన్నత స్థాయికి ఎదిగిన తమ గ్రామస్థుడు మృతి చెందడం పట్ల స్నేహితులు, గ్రామస్థులు తీవ్ర విషాదం నింపింది. వినయభాను రెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం వీరి కుటుంబం మల్కాజిగిరిలో ఉంటోంది. ఆయన తండ్రి ఉప్పల నరసింహారెడ్డి లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల ద్వారా మండలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే.. మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. వారి కుటుంబాలకు ఇండియన్ ఆర్మీ అండగా నిలుస్తుందని తెలిపారు.

Read also: Cold Storage Collapse: కూలిన కోల్డ్ స్టోరేజీ పైకప్పు.. 8 మంది దుర్మరణం

అరుణాచల్ ప్రదేశ్‌లోని బొమ్‌డిలాలో ఆర్మీ హెలికాప్టర్ గురువారం కుప్పకూలిన విషయం తెలిసిందే.. ఈ ఘటనలో ఇద్దరు పైలట్‌లు మృతి చెందారు. గురువారం ఉదయం 9.15 గంటల ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని బోమ్‌డిలా సమీపంలో ఆపరేషన్ సమయంలో ఆర్మీ ఏవియేషన్‌కు చెందిన చితా హెలికాప్టర్‌కు ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయని రక్షణ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్ తెలిపారు. హెలికాప్టర్ తరువాత బొండిలాకు పశ్చిమాన మండల్ సమీపంలో సింగే నుండి మిసామారి వైపు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు గుర్తించారు. అయితే.. మధ్యాహ్నం 12:30 గంటలకు, దిరాంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగ్జాలెప్ గ్రామస్థులు ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ను కనుగొన్నారు.. ఆ ప్రాంతంలో సిగ్నల్ లేదని, 5 మీటర్ల మేర విజిబిలిటీతో అత్యంత పొగమంచుతో కూడిన వాతావరణం ఉందని పోలీసులు తెలిపారు.

Double-Decker Bus: డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణం.. 50 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహితులు