తెలంగాణ సీఎం కేసీఆర్‌ను దేశద్రోహి అన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కోవిడ్ తీవ్రత, చలి ఉన్నప్పటికీ ఏడాదికి పైగా కాలంగా రైతులను వీధుల పాలు చేసిన వారు దేశభక్తులా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. రైతులు ఆందోళన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రైతులకు అండగా నిలబడ్డ వారు దేశద్రోహులు అవుతారా అంటూ కేటీఆర్ విమర్శించారు. దేశ భక్తిపై సర్టిఫికెట్ ఇవ్వడానికి అసలు వీళ్లేవరూ అంటూ ఆయన స్పం దించారు. కాగా రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్థిక సాయం చేయడం పై బీజేపీ నేతలు విమర్శించారు. ఆయనను దేశ ద్రోహిగా పేర్కొంటూ పలు వ్యాఖ్యలు చేశారు.
దేశంలో రైతులపై బీజేపీ సర్కార్ కఠినంగా వ్యవహరింస్తుందని కేటీఆర్ అన్నారు. రైతుల మద్దతూ లేకుండా రైతుల చట్టాలు తీసుకొస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా బీజేపీ సర్కార్ రైతుల గురించి ఆలోచించి కనీస మద్దతు ధర పై కూడానిర్ణయం ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నా రన్నారు. అనాలోచిత నిర్ణయాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
