Site icon NTV Telugu

గాంధీ భవన్‌లో వాస్తు మార్పులు.. ఆలోపే..!

Gandhi Bhavan

Gandhi Bhavan

తెలంగాణలో సుదీర్ఘ కసరత్తు తర్వాత పీసీసీ కమిటీలను ప్రకటించింది ఏఐసీసీ.. దీనిపై కొన్ని ఆరోపణలు, విమర్శలు ఉన్నా.. కొత్తగా తెలంగాణ పీసీసీ చీఫ్‌గా నియమితులైన రేవంత్‌రెడ్డి ఈ నెల 7వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు.. ఈ లోపుగానే గాంధీ భవన్‌లో వాస్తు మార్పులు జరగాలని నిర్ణయించారు.. దీంతో.. రంగ ప్రవేశం చేసిన వాస్తు నిపుణులు, వేదపండితులు.. గాంధీ భవన్‌ను పరిశీలించి కొన్ని మార్పులు చేసినట్టుగా చెబుతున్నారు.. గాంధీభవన్‌లో ఎంట్రీ పాయింట్‌ను కొత్త కమిటీ నేతలు మార్చాలని నిర్ణయానికి వచ్చారు.. ఇంట్రెన్స్ ను గాంధీ భవన్ క్యాంటిన్ నుండి పాత గేట్ నుండి రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.. ఇక, గాంధీ భవన్‌లో పార్టీ జెండాలు అమ్మేరూమ్‌, సెక్యూరిటీ రూమ్‌లను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు.. గాంధీ భవన్ తూర్పు ఈశాన్యం వైపు ఎలాంటి బరువు ఉండకుండా ఏర్పట్లు చేస్తున్నారు హస్తం పార్టీ నేతలు.. గాంధీ భవన్ ఆవరణలో ఎలాంటి కట్టడాలు లేకుండా కేవలం గాంధీ విగ్రహం మాత్రమే ఉండే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. రేవంత్‌ రెడ్డి ప్రమాణస్వీకారం నాటికి అన్ని పనులు పూర్తి చేస్తామని చెబుతున్నారు. మరి హస్తం పార్టీ.. హస్త రేకలను ఈ వాస్తు మార్పులు మారుస్తాయోమే చూడాలి… అధికార పార్టీకి, సీఎం కేసీఆర్‌కు వాస్తు పిచ్చి అంటూ విమర్శలు చేసిన నేతలు.. ఇప్పుడు వాస్తు మార్పులు చేయడం ఏంటి అనేవారు లేకపోలేదు.

Exit mobile version