Site icon NTV Telugu

Business : తక్కువ ధరకే ఎయిర్ ప్యాడ్స్.. తెలంగాణలో మరో ఫ్యాక్టరీ..!

Foxconn

Foxconn

వరల్డ్ లోనే అతిపెద్ద కాంట్రాక్ట్ ఎలాక్ట్రానిక్స్ తయారీదారు, యాపిల్ ఐఫోన్ మేకర్ ఫాక్స్ కాన్ భారత్ లో మరో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి వేల కోట్ల రూపాయల ఆర్డర్ ను సాధించింది. దీంతో ఇప్పటి వరకు ఐఫోన్ మేకర్ గా ఉన్న తైవాన్ కు మేకర్ ఇప్పుడు తొలిసారి ఎయిర్ పాడ్స్ ను కూడా ఉత్పత్తి చేయనుంది. దాదాపు 70శాతం ఐఫోన్ల అసెంబ్లర్ ఫాక్స్ కాన్ కొత్త ప్లాంట్ లో ఎయిర్ పాడ్స్ ఉత్పత్తి షూరు అయితే తక్కువ ధరకే లభ్యం కానున్న యాపిల్ ఉత్పత్తుల జాబితాలో ఇవి కూడా చేరనున్నాయి.

Also Read : Friday Releases: ఈవారం థియేట్రికల్ రిలీజెస్ ఇవే!

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఇండియా ఎయిర్ పాడ్స్ ప్లాంట్ లో ఫాక్స్ కాన్ 200 మిలియన్ డాలర్లకు( సుమారు రూ. 1,654 కోట్లు) పైగా పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్లాంట్ ద్వారా 2024 చివరి నాటికి తయారీని ప్రారంభించాలనే ఫాక్స్ కాన్ లక్ష్యంగా పెట్టుకుంది. గత కొంతకాలంగా యాపిల్ భారత్ లో తన కార్యకలాపాలను విస్తరించాలని యోచిస్తోంది. అయితే తక్కువ లాభాలు ఉన్నందున ఎయిర్ పాడ్ లను తయారు చేయాలనే దానిపై ఫాక్స్ కాన్ తీవ్రంగా చర్చిస్తోంది.. చివరికి ఒప్పందంతో ముందుకు సాగాలని నిర్ణయించుకుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Also Read : Talasani Srinivas Yadav: మేము కమిట్మెంట్‌తో పని చేస్తుంటే.. బీజేపీ కుట్రలు చేస్తుంది

అయితే ఈ ఊహాగానాలపై వ్యాఖ్యానించిందేకు నిరాకరించిన ఫాక్స్ కాన్ కస్టమర్ డిమాండ్ ను తీర్చడానికి, ఉత్పత్తి కోసం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడానికి చైనా వెలుపల పెట్టుబడులను పెంచుతామని ఫాక్స్ కాన్ వెల్లడిచింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఎయిర్ పాడ్స్ సరఫరా చేస్తున్న చైనా కంపెనీలలను కాదని, భారత్ లో కాంట్రాక్ట్ ఉన్న ఫాక్స్ కాన్ తో యాపిల్ ఒప్పందం చేసుకున్నట్లు అంచనా. మరో వైపు ఈ న్యూస్ పై యాపిల్ అధికారికంగా రియాక్ట్ కాలేదు. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ యాపిల్ నుంచి మరిన్ని ఆర్డర్ లను గెలుచుకోవడానికి Wistron Corp, Pegatron Corp వంటి తైవానీస్ ప్రత్యర్థులతో ఫాక్స్ కాన్ సంస్థ పోటీపడుతుంది.

Exit mobile version