Site icon NTV Telugu

Elections 2024: తెలంగాణ నుంచి సొంతూళ్లకు ఓటర్లు.. నెల క్రితమే రిజర్వేషన్లు..

Buses Full

Buses Full

Elections 2024: ఈ నెల 13న తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకే రోజు జరగనున్నాయి. దీంతో హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ వాసులు ఓటు వేసేందుకు తమ ఇళ్లకు చేరుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సొంత రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో పాటు సెలవులు కూడా రావడంతో రెండు చోట్ల ఓటు హక్కు కలిగిన ఆంధ్రా ప్రజలు అక్కడికి వెళ్తున్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతుండగా, ప్రతి ఓటుకు ప్రాధాన్యం పెరుగుతోందని, అందుకే గ్రేటర్‌లో నివసించే ప్రజలు ఆంధ్రాకు తరలిపోతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Read also: BJP MLAs: ఎమ్మెల్యేలు రాజాసింగ్‌, పాయల్ శంకర్ పై కేసు నమోదు.. కారణం ఇదీ..

కాగా.. ఆంధ్రా వైపు వెళ్లే బస్సుల్లో జనం కిక్కిరిసిపోతున్నారు. నెల రోజుల ముందే రైల్వే రిజర్వేషన్లు ముగియడంతో వందల సంఖ్యలో వెయిటింగ్ లిస్టులు దర్శనమివ్వడం పట్ల ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల ఆర్టీసీలు పదుల సంఖ్యలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినా సీట్లన్నీ నిండిపోయాయి. అదనపు బస్సులు నడపలేని కారణంగా APSRTC ఎక్స్‌ప్రెస్ రైళ్లను సిద్ధం చేస్తోంది. బెంగళూరు నుంచి విజయవాడకు ప్రత్యేక బస్సు సర్వీసును ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. సికింద్రాబాద్ నుంచి విశాఖకు బస్సులో వెళ్లాలంటే 12 గంటలకు పైగా సమయం పడుతుండడంతో ఏపీ స్లీపర్లకు డిమాండ్ పెరిగింది.

ఎన్నికల సీజన్ కావడంతో గతంలో కంటే ప్రైవేట్ బస్సుల్లో టికెట్ ధరలు పెంచినట్లు ఓటర్లు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, నర్సాపురం, కాకినాడ, విశాఖపట్నం వెళ్లే రైళ్లకు ఈ నెల 12వ తేదీతో రిజర్వేషన్ పూర్తయింది. నెల్లూరు, తిరుపతి వైపు వెళ్లే రహదారిలోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఈ నెల 10, 11 తేదీల్లో వందలాది దూరప్రాంత రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ ఉంది. మరి కొందరిలో పశ్చాత్తాపం హద్దులు దాటిపోతోంది. సికింద్రాబాద్ నుంచి నడిచే వివిధ ప్రత్యేక రైళ్లలో భారీ వెయిటింగ్ లిస్ట్ ఉంది. వేసవి సెలవుల దృష్ట్యా ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు టిఎస్‌ఆర్‌టిసి అదనపు బస్సులను నడుపుతోంది. ముందుగా బుక్ చేసుకున్న వారికి టికెట్ ధరపై 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు.

Read also: Minister Seethakka: రైతు రుణ మాఫీ ఏక కాలంలో చేసిన ఘనత కాంగ్రెస్ దే..

గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైంది. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం 46.68 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. ఏపీ వాసులు ఎక్కువగా నివసించే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఓటింగ్ శాతం 60 లోపే ఉంది. ఇది కాకుండా ఈసారి సోమవారం ఓటింగ్ జరుగుతోంది. పోలింగ్ రోజు (సోమవారం) రెండవ శనివారం, ఆదివారం తర్వాత.. ప్రభుత్వ, ఐటీ, బ్యాంకు ఉద్యోగులు నిరంతరం సెలవుల్లో వస్తున్నారు. బసవ జయంతి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఐచ్ఛిక సెలవులు లభిస్తాయి. ఏపీకి వెళ్లే ఆంధ్రా ఓటర్ల శాతం 90 శాతం దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Elections 2024: టూవీలర్‌ లో రూ.53.5 లక్షలు.. సీజ్ చేసిన అధికారులు

Exit mobile version