NTV Telugu Site icon

AP CM Jagan: కేసీఆర్ ను పరామర్శించిన జగన్.. లంచ్ తరువాత లోటస్ ఫాండ్ కు..

Ap Cm Jagana

Ap Cm Jagana

AP CM Jagan: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను ఏపీ సీఎం జగన్ ఇవాళ కలిసారు. ఇటీవల తుంటి ఎముకకు శస్త్రచికిత్స చేయించుకున్న కేసీఆర్‌ను ఏపీ సీఎం జగన్‌ పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని కేసీఆర్ నివాసంలో గులాబీ బాస్ ను పరామర్శించిన జగన్.. కేసీఆర్ తో కలిసి భోజనం చేసిన అనంతరం లోటస్ పాండ్ లోని ఆయన నివాసానికి వెళ్లనున్నారు. కాగా.. దాదాపు రెండేళ్ల తర్వాత జగన్, లోటస్ పాండ్ లో నివాసానికి వెళ్లనున్నారు. కాగా.. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న జగన్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి కేసీఆర్ ఇంటికి వెళ్లారు. జగన్‌కు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్వాగతం పలికారు. కేటీఆర్ స్వయంగా జగన్ ను తీసుకుని లోపలికి వెళ్లారు.

Read also: Peddireddy Ramachandra Reddy: కాంగ్రెస్‌లో చేరిన వైఎస్‌ షర్మిల.. హాట్‌ కామెంట్లు చేసిన మంత్రి పెద్దిరెడ్డి

అయితే కేసీఆర్ ను జగన్ మర్యాదపూర్వకంగా కలిశారని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. మరి వీరి మధ్య ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయో తెలియాల్సి ఉంది. డిసెంబర్ 8న ఫామ్‌హౌస్‌లోని బాత్‌రూమ్‌లో జారిపడి కేసీఆర్ తుంటి ఎముకకు తీవ్ర గాయమైంది. కేసీఆర్ కుటుంబీకులు వెంటనే ఆయనను యశోద ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా వైద్యులు పరీక్షించి తుంటి ఎముక ఫ్రాక్చర్ అయిందని, ఆపరేషన్ చేయాలని చెప్పారు. అనంతరం యశోద వైద్యుల ఆధ్వర్యంలో కేసీఆర్‌కు ఎముకల మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన కేసీఆర్ డిసెంబర్ 15న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి నందినగర్‌లోని పాత ఇంటికి వెళ్లారు. కేసీఆర్ ఇంట్లో కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేసీఆర్ తో జగన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
AUS vs PAK: ఆ ముగ్గురిని ఔట్ చేయడానికి చాలా శ్రమించా: లియోన్

Show comments