NTV Telugu Site icon

పాతబస్తీలో మరో అత్యాచార ఘటన.. మూడు నెలలుగా..!

హైదరాబాద్‌లో వరుసగా అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూ కలవరపెడుతున్నాయి… తాజాగా, ఓల్డ్‌సిటీలో మరో ఘటన బయటపడింది.. తమ్ముడి భార్యపై కన్నేసిన ఇర్ఫాన్‌ అనే వ్యక్తి.. ఆమెను లోబర్చుకుని మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు.. విషయం పోలీసులకు గానీ, బయట ఎవ్వరికి చెప్పినా చంపేస్తానంటూ బాధిత మహిళను బెదిరింపులకు గురిచేశాడు.. అంతేకాదు.. పలుమార్లు దాడులు కూడా చేసినట్టు బాధిత మహిళ చెబుతోంది.. మూడు నెలలపాటు ఇర్ఫాన్‌ చిత్రహింసలను మౌనంగా బరించిన ఆ మహిళ.. చివరకు కుటుంబపెద్దల సహకారంతో.. భరోసా సెంటర్‌ను ఆశ్రయించారు.. దీంతో.. మీర్‌చౌక్‌ పోలీస్‌స్టేషన్‌లో ఇర్ఫాన్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు.. కాగా, చిన్నారులు, యువతులు, మహిళలు, వృద్ధులు అనే తేడాలేకుండా వరుసగా వెలుగుచూస్తోన్న అత్యాచార ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.