NTV Telugu Site icon

Major Investment: తెలంగాణలో మరో భారీ పెట్టుబడి.. రూ.700 కోట్లతో వ్యాక్సిన్‌ తయారీ కేంద్రం..

Ktr

Ktr

తెలంగాణ రాష్ట్రంలో వరుసగా బడా బడా కంపెనీలు పెట్టుబడులూ పెడుతూనే ఉన్నాయి.. తాజాగా మరో భారీ పెట్టుబడి తెలంగాణ రాష్ట్రానికి వస్తుంది.. హైద‌రాబాద్ శివారులోని జీనోమ్ వ్యాలీలో యానిమల్ వాక్సిన్ త‌యారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది ఇండియ‌న్ ఇమ్యూనోలాజిక‌ల్స్ లిమిటెడ్ (ఐఐఎల్‌). ఈ యూనిట్ ద్వారా రాష్ట్రంలో ఏకంగా రూ.700 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు సిద్ధమైంది ఐఐఎల్.. ఇవాళ హైద‌రాబాద్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన ఐఐఎల్ ఎండీ ఆనంద్ కుమార్.. ఆ సంస్థ ప్రతినిధి బృందం… త‌మ పెట్టుబడికి సంబంధించిన ప్రతిపాదలను ఆయనకు వెళ్లడించారు.. దీనిపై సంతోషాన్ని వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్..

Read Also: Road Accident: సీఐడీ చీఫ్‌ కారు బోల్తా.. అక్కడిక్కడే ఆయన భార్య మృతి..

అయితే, ఇప్పటికే గ‌చ్చిబౌలిలో ఐఐఎల్‌కు ఓ యానిమల్ వాక్సిన్ ప్లాంట్ ఉండగా.. దీని ద్వారా ఏడాదికి 300 మిలియ‌న్ వాక్సిన్ డోసుల ఉత్పత్తి జరుగుతోంది… ఇక, జీనోమ్ వ్యాలీలో కొత్తగా ఏర్పాటు చేయనున్న మరో యూనిట్‌ ద్వారా సంవత్సరానికి మరో 300 మిలియ‌న్ యూనిట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు.. దీని కోసం ఆ సంస్థ 700 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుండగా… ఈ కొత్త యూనిట్‌ ద్వారా తెలంగాణలో మరో 750 మందికి పైగా ఉపాధి లభించనున్నట్టు వెల్లడించారు మంత్రి కేటీఆర్.. ఈ యూనిట్‌ ద్వారా పాదాలు, నోటి ద్వారా పశువులకు సంక్రమించే వ్యాధులకు సంబంధించిన వ్యాక్సిన్ ఉత్పత్తి రెట్టింపు కానుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించిన మంత్రి కేటీఆర్‌.. ఈ పెట్టుబడిపై హర్షం వ్యక్తం చేస్తూ.. మానవులకు మాత్రమే కాకుండా జంతువుల ఆరోగ్యానికి కూడా ప్రపంచ ఆరోగ్యానికి హైదరాబాద్ యొక్క సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు.

Show comments