Another Case Filed On Ramachandra Bharathi: టీఆర్ఎష్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తాజాగా కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన రామచంద్రభారతిపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌లను మూడేసి చొప్పున నకిలీవి తయారు చేసి.. తన వద్ద పెట్టుకున్నాడని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేశారు. ట్విస్ట్ ఏమిటంటే.. రెండ్రోజుల క్రితమే పోలీసులు పలు సెక్షన్ల రామచంద్రభారతిపై కింద నమోదు చేశారు. కానీ.. వివరాలు వెల్లడించకుండా గోప్యత పాటించారు. ఇందుకు సంబంధించి.. పోలీసులు ఆధారాల్ని సేకరిస్తున్నారు. ఈ కేసులో నేరం రుజువైతే.. రామచంద్రభారతికి పదేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది.
కాగా.. పార్టీ ఫిరాయించేందుకు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారంటూ, ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు మొయినాబాద్ ఫాంహౌస్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న సంగతి తెలిసిందే! ఓ జాతీయ పార్టీ అండదండలతో వ్యూహాత్మర బేరసారాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేగింది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పరస్పన విమర్శలు చేసుకున్నారు. అటు.. ఈ కేసు దర్యాప్తుపై ఇన్ని రోజులు స్టే విధించిన తెలంగాణ హైకోర్టు, మంగళవారం స్టే ఎత్తివేస్తూ కేసుని దర్యాప్తు చేయొచ్చంటూ పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. నిందితుల పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని తీర్పునిచ్చింది. అలాగే.. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ను పెండింగ్‌లో పెట్టింది. ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.