Site icon NTV Telugu

Anjankumar Yadav: గాంధీ ఫ్యామిలీకి అండగా ఉందాం

Anjan Kumar

Anjan Kumar

కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు మాజీ మంత్రి అంజన్ కుమార్ యాదవ్. కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ సోనియాగాంధీ, రాహుల్ గాంధీ లను ఈ.డి పేరుతో విచారణ చేస్తూ రాజకీయంగా దెబ్బ తీయాలని చూస్తుందన్నారు. దేశంలో అన్ని విధాలుగా త్యాగాలు చేసిన కుటుంబం వారిది. దేశ స్వాతంత్రం కోసం ఆస్తులను, కుటుంబాలను, ప్రాణాలను త్యాగం చేసిన కుటుంబం గాంధీ లది అన్నారు అంజన్ కుమార్. స్వంత ఆస్తులను దేశం కోసం త్యాగం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ నేతలది. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ లు దేశం కోసం ప్రాణాలు అర్పించారు.

Marri Sashidhar Reddy: క్లౌడ్ బరస్ట్ లేదు ఏంలేదు.. కేసీఆర్ తెలివి అదేనా?

సోనియా గాంధీ పైన అక్రమంగా ఈ.డి కేసు పెట్టి విచారణ పేరుతో వేదిస్తున్నందుకు నిరసనగా 21వ తేదీన హైదరాబాద్ లో ఈ.డి కార్యాలయం ముందు భారీగా ధర్నా చేయనున్నాం. ఉదయం 10 గంటలకు నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభం అవుతుంది. అక్కడ నుంచి ర్యాలీ గా బయలుదేరి ఈ.డి కార్యాలయం ముందు ధర్నా చేస్తాం. ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చి గాంధీ కుటుంబానికి అండగా ఉండాలని అంజన్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. జూలై 21న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు సోనియాగాంధీ హాజరుకానున్నారు. దీంతో 21వ తేదీన దేశవ్యాప్తంగా నిరసన తెలపాలని కాంగ్రెస్ శ్రేణులు నిర్ణయించాయి. ఢిల్లీతో పాటు దేశంలోని ప్రతి రాష్ట్రంలో..కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెల‌పాల‌ని కాంగ్రెస్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. గతంలో రాహుల్ గాంధీ ఈడీ విచారణకు హాజరైనప్పుడు కూడా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు కాంగ్రెస్ నేతలు. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

Laal Singh Chaddha : రూపను పరిచయం చేసిన మెగాస్టార్!

Exit mobile version