Anil Kumar Eravathri Sensational Comments On Prashanth Reddy: తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డిపై మాజీ విప్ ఈరవత్రి అనిల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ పీసీసీపై మాట్లాడే నైతిక అర్హత ప్రశాంత్‌కు లేదని ధ్వజమెత్తారు. ప్రశాంత్ రెడ్డికి మంత్రి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ పదవులు రావడానికి కారణం.. కేసీఆర్‌కి మందు, సోడా పోయడం వల్లేనని ఆరోపించారు. బాల్కొండ ప్రజలు ప్రశాంత్ రెడ్డిని కేసీఆర్‌కి పెద్ద జీతగాడు అని కామెంట్లు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా ఉండి, ప్రశాంత్ రెడ్డి వేల కోట్లు దోచుకున్నారని ఆరోపణలు చేశారు. ఇప్పటివరకు ఎన్ని డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టారో కూడా ప్రశాంత్ రెడ్డికి తెలియదని దుయ్యబట్టారు.
కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని.. చివరికి అమరవీరుల స్థూపంలోనూ భారీ అవినీతి జరిగిందని ఈరవత్రి అనిల్ ఆరోపణలు చేశారు. అమరవీరుల స్థూపంలో అవినీతి విషయంపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. అందులో అవినీతి జరిగిందని తాము నిరూపిస్తామని ఛాలెంజ్ చేశారు. ఆ స్థూపం నిర్మాణంలో అవినీతి జరగడం వల్ల.. అమరవీరుల ఆత్మగౌష విలపిస్తోందని చెప్పారు. తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. అమరవీరుల స్థూపంపై విచారణ జరిపిస్తామన్నారు. అవినీతిపరుల్ని చర్లపల్లి జైలుకు పంపించి, అక్కడ డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తామన్నారు. బాల్కొండ నియోజకవర్గ యువతకి గంజాయి అలవాటు కూడా చేస్తున్నారంటూ ఈరవత్రి అనిల్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
Nikhil Siddhartha: నన్ను డ్రగ్స్ తీసుకోమ్మని ఆఫర్ చేశారు.. నిఖిల్ సంచలన వ్యాఖ్యలు