Rangam Bhavishyavani 2022: రంగం భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత.. ఏం చెప్పారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సికింద్రాబాద్ లో లక్సర్ బోనాలు ఘనంగా మొదలయ్యాయి. రంగంకోసం సర్వం సద్దం చేసారు అధికారుల. రంగంలో అమ్మవారి భవిష్యవాని ప్రారంభమైంది. అవివాహిత అయిన జోగిని శరీరంపై ఆవహించిన అమ్మవారు రంగంలో భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మొక్కుబడిగా పూజలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. నన్ను సంతోషంగా చేయడం లేదని, మీ సంతోషం కోసం పూజలు చేయండి, సరిగ్గా పూజలు జరపడం లేదని పేర్కొన్నారు. ప్రతీ ఏటా చెబుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. నాకు సక్రమంగా పూజలు జరిపించండి, శాస్త్రోక్తంగా నిర్వహించండని అన్నారు.
నేను మీ హృదయాల్లో దూరి కాపాడుతున్నాను అయినా నన్ను మీరు సంతోషంగా పూజలు జరిపించడంలేదని అన్నారు. ఏటికేటా నా రూపాన్ని మారుస్తున్నారని మండిపడ్డారు. నాకు స్థిరమైన రూపం కావాలని, నాది అంతా కాజేస్తున్నారంటూ ఆగ్రమం వ్యక్తం చేశారు. నేను సంతోషంగా లేను అయినా కూడా మిమ్మల్ని సంతోషంగా ఉండేలా చూస్తున్నానని అన్నారు. నా గర్భగుడిలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించాలని తెలిపారు. నాపిల్లలైన గర్భణీ స్త్రీలకు, ఆడపిల్లకు తన కడుపునపెట్టుకుని చూసుకుంటున్నానని పలికారు. ఎన్ని తప్పులు చేసినా నా బిడ్డలేనని క్షమిస్తున్నాను అని అన్నారు. మొక్కుబడిగా పూజలు చేస్తున్నారని, గతంలో చేసినట్టుగా పూజలు చేయడంలేదని అమ్మవారు ఆగ్రహం వ్యక్తం చేసారు.
Also Read
- Ganesh Immersion 2026 : గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు.. 20 వేల మంది పోలీసులతో నిఘా.!
- Cab Driver Rajasekhar : క్యాబ్ కోసం పక్కా స్కెచ్.. డ్రైవర్ రాజశేఖర్ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్.!
- DA Release : తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రెండు డీఏలకు గ్రీన్ సిగ్నల్.!
- KTR: కరెంట్ కోతలపై కేటీఆర్ ఫైర్.. ‘ఇది ఎల్ నినో కాదు.. ఎల్ కాంగ్రెస్’.!
వర్షాల గురించి మాట్లాడుతూ.. గర్భాలయంలో శాస్త్రీయబద్దంగా పూజలు నిర్వహించాలని, తనబిడ్డలే అని ఇప్పటివరకు తాను సరిపెట్టుకుంటున్నారని అన్నారు. మీరు కళ్లు తెరవడానికే తాను కుంభవృష్టి వర్షాలు కురిపించానని, ఇప్పటికైనా తనకు సంతోషంగా పూజలు చేయాలని అన్నారు. గుండె మీద చేయి వేసుకుని చెప్పండి, మీరు సరిగ్గా పూజలు చేస్తున్నారా? అంటూ అమ్మవారు ప్రశ్నించారు. మీకు కనువిప్పు కలిగేందుకే ఈ కుంభవృష్టి వానలు కురిపిస్తున్నాని తెలిపారు. అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజలు జరిపించాలని కోరారు.
తాజావార్తలు
-
Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. మళ్లీ దేశంలోనే నంబర్ 1 ధనవంతుడిగా రికార్డ్!
-
Meloni: యూఎన్‌కు మెలోనీ దూరం.. ట్రంప్‌ను కలవడం ఇష్టం లేకనేనా?
-
Ganesh Immersion 2026 : గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు.. 20 వేల మంది పోలీసులతో నిఘా.!
-
BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
-
Ellipaya Karam: నానమ్మల నాటి నాటు రుచి.. జ్వరం, జలుబును తరిమికొట్టే ఎల్లిపాయ కారం సింపుల్ ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!