NTV Telugu Site icon

Amit Shah Hyderabad Tour: అమిత్ షా హైదరాబాద్ టూర్.. భారీ సభకు ఏర్పాట్లు

Amith Sah

Amith Sah

Amit Shah Hyderabad Tour: కర్ణాటక ఎన్నికలు వచ్చే నెలలో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం నెక్ట్స్ టార్గెట్ తెలంగాణపై పెట్టింది.. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరో 8 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచుతోంది. అందులో భాగంగానే ఈ నెల 23న అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఈ పొలిటికల్ టూర్ లో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అమిత్ షా పర్యటన సందర్భంగా కాషాయం పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని తెలుస్తోంది. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అమిత్ షా వచ్చే ఎన్నికల సమర శంఖారావాన్ని పూరిస్తారని, ఆ పర్యటనతో రాష్ట్రంలో వచ్చే ఎన్నికలకు బీజేపీ దూకుడు పెరుగుతుందని కమలనాథులు చెబుతున్నారు. అమిత్ షా సభను భారీ ఎత్తున నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేసింది. అమిత్ షా బహిరంగ సభకు ఇంకా ఐదు రోజులే సమయం ఉండడంతో కాషాయ నేతలు ఏర్పాట్లు మొదలుపెట్టనున్నారు. భారీగా జన సమీకరణకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Read also: Mental Health: మిమ్మల్ని మెంటల్‌ గా వీక్‌ చేసే అలవాట్లు..

గత రెండు నెలలుగా అమిత్ షా తెలంగాణ పర్యటన కొనసాగుతోంది. అయితే కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న అమిత్ షాకు ఆ రాష్ట్ర పర్యటనకు సమయం దొరకలేదు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత అమిత్ షా తెలంగాణా పర్యటనకు సమయం ఫిక్స్ అయింది. ప్రతి నెలా ఒక్కసారైనా తెలంగాణ పర్యటనకు వస్తానని గతంలో అమిత్ షా రాష్ట్ర బీజేపీ నేతలకు హామీ ఇచ్చారు. అయితే దేశంలోని పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోయారు. అయితే వచ్చే నెల 13వ తేదీతో కర్ణాటక ఎన్నికలు ముగుస్తున్నందున ఇకపై తెలంగాణలో అమిత్ షా వరుస పర్యటనలు చేస్తారని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. అవసరమైతే అమిత్ షా హైదరాబాద్ లోనే మకాం వేసి రాష్ట్రంలో బీజేపీ గెలుపునకు వ్యూహాలు రచించి క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. ఉత్తరాదిలో బలపడాలని చూస్తున్న బీజేపీ కర్ణాటక, తెలంగాణలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతోంది. ప్రస్తుతం కర్నాటకలో అధికారంలో ఉండగా, ఆ అధికారాన్ని నిలబెట్టుకోవడం ఆ పార్టీకి ఇప్పుడు అవసరం. కర్నాటకలో మళ్లీ అధికారంలోకి వస్తే తెలంగాణ బీజేపీ క్యాడర్‌లో కూడా కొంత ఉత్సాహాన్ని నింపుతుంది.
Harish Rao: ఉన్న మాటంటే ఉలుకెందుకు.. మరోసారి ఏపీ మంత్రులపై హరీశ్‌ రావు ఫైర్