NTV Telugu Site icon

Ambulance Theft: 108 అంబులెన్స్ చోరీ చేసిన దొంగ.. సినీ ఫక్కిలో సాగిన చేజింగ్ ఆట..

Ambulence Chori

Ambulence Chori

Ambulance Theft: ఓ దొంగ ఏకంగా అంబులెన్స్‌ను దొంగిలించి, పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి పరుగులు పెట్టించాడు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై సిని ఫక్కీలో సాగిన దొంగ-పోలీసుల ఛేజింగ్ ఆట వైరల్‌గా మారింది.

Read also: Ajith: అసలు విఘ్నేశ్ శివన్, అజిత్‌కు ఎక్కడ చెడింది..?

హయత్‌నగర్‌లో 108 వాహనాన్ని ఓ దొంగ ఉదయం 4 గంటలకు హాస్పిటల్ ముందు నుండి చోరి చేసి పరార్‌ అయ్యాడు. దీంతో అప్రమత్తమైన సన్ రైస్ హాస్పిటల్ అంబులెన్స్ సిబ్బంది 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సమాచారం అందిన వెంటనే పోలీసులు అతడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. కాగా.. ఆ దొంగ అంబులెన్స్ సైరన్ మోగిస్తూ అతివేగంతో విజయవాడ వైపు పరారయ్యాడు.

Read also: CM Chandrababu : డ్రగ్స్‌ వ్యతిరేక పోరాటం పాఠశాల స్థాయి నుంచే ప్రారంభమవ్వాలి

చిట్యాల వద్ద పట్టుకునే ప్రయత్నంలో ఓ వ్యక్తిని ఢీ కొట్టాడు. అనంతరం కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద గేటును ఢీకొట్టి ముందుకు దూసుకెళ్లాడు. టేకుమట్ల వద్ద పోలీసులు అడ్డుకుని దొంగను పట్టుకున్నారు. నిందితుడిపై గతంలో పలు దొంగతనాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అంబులెన్స్ ఢీకొన్న ఘటనలో జాన్ రెడ్డి అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.
Cancer Medicine : క్యాన్సర్ రోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఈ మూడు మందులపై ధరల తగ్గింపు

Show comments