NTV Telugu Site icon

Allola Indrakaran Reddy: సంచలన వ్యాఖ్యలు.. దళిత బంధు మా ఇష్టం వచ్చిన వాళ్లకే ఇస్తాం

Indrakaran Reddy

Indrakaran Reddy

Allola Indrakaran Reddy: టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేల వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కొద్దిరోజులుగా మంత్రులు, ఎమ్మెల్యేలపై ప్రజలు ప్రశ్నిస్తుండటంతో.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు రాలేదని ప్రశ్నించిన వారిపై మండిపడుతున్నారు. కొద్దిరోజుల క్రితం కళ్యాణి లక్ష్మీ రాలేదన్న యువకుడిని పై ఎమ్మెల్యే మదసూదన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన యువకుడ్ని లోపలై అంటూ పోలీసులకు ఆర్డర్‌ చేశారు. సభలో పైసలు వస్తలేదు సార్‌ అని ఓయువకుడు ప్రశ్నించగా? ఎమ్మెల్యే ఎందుకొస్తేలేదు ఏం మట్లాడుతున్నావ్‌ అంటూ సీరియస్‌ అయ్యారు. ఇతన్ని లోపలేయ్‌ అంటూ మండిపడిన తీరు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఇప్పుడు అదే పరిస్థితి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డికి ఎదురైంది. దళిత బంధువుపై సభలో మాట్లాడుతున్న ఇంద్రకరణ్‌ రెడ్డిని మహిళలు ప్రశ్నలు అడుగగా సభలో నుంచి వెళ్లిపోవాలని, మాకు ఇష్టమెచ్చిన వారికి దళితబంధు పథకం ఇస్తామని మంత్రి ఇంద్రకరణ్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పర్యటించారు. దళిత బందు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతుండగా సభకు హాజరైన అక్కడున్న మహిళలు తమకు దళిత బంధు ఇవ్వాలని ప్రశ్నించారు. దీంతో మంత్రి అందరికి వస్తుంది ఓపిక పట్టాలన్నారు. ఆవిధంగా అనుకుంటే కొంతమందికి దళిత బంధు వచ్చింది.. దాదాపుగా కోటి యాభైలక్షలు మంజూరు చేసామని గుర్తు చేశారు. మీకు ఓపిక లేకుంటే మేమేం చేస్తాం అన్నారు మంత్రి. బీజేపీ వాల్లతో తిరుగుతున్న వారు వాళ్లనే అడిగి తీసుకోండని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా మీరు మాకు ప్రశ్నించడం ఏంటి అందరికి వస్తుంది.. ఓపికలేని వాళ్లకు మమేం చేయలేం.. దళిత బంధు మా ఇష్టం వచ్చిన వాళ్లకే ఇస్తాం అని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.

సభలో ప్రశ్నించిన వారిని బయటకు తీసుకెళ్లాలని పోలీసులకు మంత్రి ఆదేశం చేశారు. మరొక మహిళ దళిత బంధు గురించి అడగటంతో.. నువ్వు ఊరికే వుండమంటూ.. ఆమెను దబాయించారు మంత్రి. ఇప్పుడు ఈవీడియో షోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మాటి మాటికి దళిత బంధువుపై ప్రశ్నలు అడుగుతున్నవారిపై సీరియస్‌ అయిన మంత్రి వారిని బయటకు తీసుకెళ్లండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడున్న వారు అలాగే ప్రశ్నలు అడుతుండటంతో.. ఆగ్రహానికి లోనైనా మంత్రి చివరకు పోలీసులకు చెప్పారు. ప్రశ్నలను అడిగే వారిని బయటకు పంపించాలని కోరడంతో.. అక్కడ కాస్త ఉద్రిక్తత నెలకొంది. దళిత బందు రాలేదని అడిగితే మా ఇష్టం వచ్చిన వాళ్లకే ఇస్తామనడం ఏంటని మండిపడ్డారు. వీల్లంతా మనుషులు కాదా కూర్చున్నోల్లు అయినా నీకు దళిత బంధువుకింద.. పదిలక్షల రూపాయలు ఇస్తే నువ్వు ఏం చేస్తావని ప్రశ్నించారు మంత్రి. రా.. ముందుకు చూపెట్టు అంటూ పిలిచారు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్‌ అవుతుంది.

Magadheera: ఇప్పుడు రామ్‌చరణ్ వంతు.. ‘మగధీర’ స్పెషల్ షోలు