Site icon NTV Telugu

Alliant Group: నగరానికి అలియంట్ గ్రూప్‌ సంస్థ.. 9వేల మందికి ఉద్యోగ అవకాశాలు

Ktr

Ktr

Alliant Group: కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అలయంట్ గ్రూప్ హైదరాబాద్‌లో కేంద్రాన్ని ప్రారంభించనుంది. దాదాపు 9 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హ్యూస్టన్‌లో కంపెనీ సీఈవో ధవల్ జాదవ్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు. అమెరికాకు చెందిన అలయంట్ గ్రూప్ కంపెనీ హైదరాబాద్‌లో కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోందని తెలిపారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగంలో అలయెంట్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. హ్యూస్టన్‌లో ఆ కంపెనీ సీఈవో ధవల్ జాదవ్‌తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో పవర్‌హౌస్‌గా పేరొందిన అలయంట్ గ్రూప్ హైదరాబాద్‌లో బీఎఫ్‌ఎస్‌ఐ రంగాన్ని బలోపేతం చేస్తుందని మంత్రి వెల్లడించారు.

హైదరాబాద్ కేంద్రంగా కొత్తగా 9 వేల మందిని రిక్రూట్ చేసుకోనున్నట్టు తెలిపారు. ట్యాక్స్‌, అకౌంటింగ్‌, ఆడిట్‌ సర్వీస్‌, ఐటీ టెక్నాలజీ యువతకు ఇదో గొప్ప అవకాశంగా నిలుస్తుందని మంత్రి అన్నారు. హైదరాబాద్ నగరం బీఎఫ్‌ఎస్‌ఐ పరిశ్రమకు కేంద్ర బిందువుగా మారుతోందని, అలయంట్ తీసుకున్న నిర్ణయం నగరంపై ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని తెలియజేస్తోందని మంత్రి తన ట్వీట్‌లో వెల్లడించారు. హ్యూస్టన్‌లోని అలయంట్‌ గ్రూప్‌ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన మంత్రి కేటీఆర్‌కు అక్కడ ఘనస్వాగతం లభించింది. మంత్రి కేటీఆర్‌కు ఆ సంస్థ ఉద్యోగులు స్వాగతం పలికారు. పూల మాలలు వేసి ఆహ్వానం పలికారు.
Extramarital Affair: భర్త వేధింపులు.. ప్రియుడి వద్ద భార్య గోడు.. కట్ చేస్తే దారుణం

Exit mobile version