NTV Telugu Site icon

Alleti Maheshwar reddy: మీరే ఇలా చేస్తే ఎలా? మాణిక్‌రావ్ ఠాక్రే‌కు మహేశ్వర్ రెడ్డి లేఖ..

Alleti Maheshwar Reddy

Alleti Maheshwar Reddy

Alleti Maheshwar reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి. తాజాగా, ఏఐసీసీ వ్యవహారాల ఎగ్జిక్యూటివ్‌ కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి.. టీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మణిరావు ఠాక్రేకు లేఖ రాయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న మీరే ఇలా చేస్తే ఎలా..? అంటూ రాసిన లేఖ సంచలనంగా మారింది.

లేఖలో ఏముందంటే.. Pawan Kalyan Varahi Live: జనసేన వారాహి ర్యాలీ లైవ్

కాంగ్రెస్ పార్టీకి విధేయుడైన నేను మీకు ఇలాంటి ఆవేదనా భరిత లేఖ రాయాల్సి వస్తుందని ఎన్నడూ అనుకోలేదు. నా 18 ఏళ్ల రాజకీయ ప్రస్ధానంలో ఇలా బాధను, అసంతృప్తిని వ్యక్తం చేస్తూ లేఖ రాయడం కూడా ఇదే మొదటి సారి. ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ, తెలంగాణ ఛైర్మన్ గా పార్టీ హైకమాండ్ రూపొందించిన ప్రతి కార్యక్రమాన్ని రాష్ట్రంలో విజయవంతం చేసేందుకు నా వంతు కృషి చేస్తున్నాను. దాదాపు రెండేళ్లుగా ఈ బాధ్యతలను నా శక్తి మేరకు ఎక్కడా రాజీపడకుండా నిర్వహిస్తున్నాను. ఏనాడు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదు, సరికదా చిన్న వ్యాఖ్య కూడా చేయలేదు. పార్టీ ముఖ్యనేతలకు సహకరిస్తూ, సర్దుకు పోయే శైలి నాది. అలాంటిది హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా నేను ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు తలపెట్టిన యాత్రను నాలుగు రోజులు నిర్వహించిన అనంతరం అర్ధంతరంగా నిలిపివేయాలని మీరు ఆదేశించడం నన్ను తీవ్రంగా బాధించింది.

Read alsso:  Pre-Installed Apps: మొబైల్స్‌లో ప్రీ ఇన్‌స్టాల్ యాప్‌లపై కేంద్రం ఉక్కుపాదం..?

భారత ప్రజల ఆశాజ్యోతి అయిన రాహుల్ గాంధీ అన్ని వర్గాలను సమైక్య పరిచేందుకు దేశ వ్యాప్తంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర సందేశాన్ని తెలంగాణ ప్రజలందరికీ చేరవేసేందుకు పార్టీ నేతలంతా ఎక్కడికక్కడే వారి ప్రాంతాల్లో రెండు నెలల పాటు క్షేత్ర స్ధాయిలో హాత్ సే హాత్ జోడో యాత్రలు చేయాలనేది ఏఐసిసి ప్రోగ్రామ్. తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కమిటీ ఛైర్మన్ గా నావంతు కృషి చేస్తున్నాను. నేతలంతా ఎవరి నియోజకవర్గాల్లో వారు ఈ హాత్ సే హాత్ జోడో యాత్రలు చేసేలా ప్రణాళికలు రూపొందించి ప్రోత్సహించాను. అయితే పిఏసి మీటింగ్ లో మీరు సీనియర్ లీడర్లు తలా 20 నుంచి 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్రలు చేయాలని ప్రతిపాదించగా, అది సరైన విధానం కాదని, సీనియర్లంతా కలిసి ఒక్కటే యాత్ర చేయాలని, అపుడే కాంగ్రెస్ ఐక్యంగా ఉందనే అంశం ప్రజల్లోకి వెళ్తుందని, లేదంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని మీటింగ్ లో నేను వాదించిన విషయం వాస్తవం కాదా? కానీ మీరు అంగీకరించకుండా, సనయర్లంతా విడి విడిగానే యాత్రలు చేయాలని ఆదేశించారు. దాంతో మీ సూచనల ప్రకారం నేను ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు యాత్రకు శ్రీకారం చుట్టాను.

Read alsso:  Bandi sanjay: 15న రాలేను కానీ.. ఎందుకు హాజరు కావాలో వివరణ ఇవ్వండి..

సీనియర్ నేతలను సంప్రదించి వారి సలహాలు, సూచనలు, ప్రోత్సాహంతో యాత్ర రూట్ మ్యాపు ఖరారు చేశాం. మార్చి మూడో తేదీన నా సొంత జిల్లా నిర్మల్ లోని భైంసాలో ఈ యాత్రను ప్రారంభించగా, ఈ సభలో పిసిసి మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సి.ఎల్.పి నేత మల్లు భట్టి విక్రమార్క, కౌన్సిల్ లో కాంగ్రెస్ పక్ష నేత జీవన్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, కోదండరెడ్డి వంటి పలువురు సీనియర్ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో, ఈ మీటింగ్ విజయవంతమైంది. ఆ తర్వాత నిర్మల్ లో జరిగిన భారీ బహిరంగ సభలో వేలాది మంది తరలిరాగా, కిలోమీటర్ల మేర జనం ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ సత్తా చాటారు. నిర్మల్ సభలో మీతో పాటు ఏఐసిసి కార్యదర్శి నదీమ్ జావేద్, వి.హనుమంతారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహా వంటి పలువురు ఇతర సీనియర్ నేతలు పాల్గొన్న విషయం మీకు తెల్సిందే. మీరు కూడా ఆ జనాన్ని, కాంగ్రెస్ క్యాడర్ లో ఉన్న జోష్ ను చూసి ఆశ్చర్యపోయి, సభను బ్రహ్మండంగా నిర్వహించారని అభినందించారు.

Read alsso:  Pidamarthi Ravi: వెన్నుపోటు పొడవడం సండ్రకు అలవాటే.. బీఅర్ ఎస్ లో ఉంటారనే గ్యారెంటీ లేదు

అత్యంత విజయవంతంగా సాగుతున్న నా తెలంగాణ పోరు యాత్రను హోలీ పండుగ సందర్భంగా రెండు రోజుల పాటు విరామం ఇవ్వాల్సి వచ్చింది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కు తలపెట్టిన నా తెలంగాణ పోరు యాత్రను విరామం అనంతరం తిరిగి ఈ నెల పదో తేదీ నుంచి ప్రారంభించేందుకు నేను అన్ని ఏర్పాట్లు ముందే చేసుకున్నాను. కానీ మీరు నిర్మల్ సభ ముగిసిన అనంతరం, షెడ్యూల్ ప్రకారం నా యాత్రను కొనసాగించడానికి వీల్లేదని, రద్దు చేసుకోవాలని ఆదేశించడం నన్ను షాక్ కు గురిచేసింది. ఈ సందర్భంలో మీరు నాతో మాట్లాడిన తీరు కూడా నన్ను తీవ్రంగా బాధించింది. ఇలా మీరు నన్నుతీవ్రంగా అవమానించడంతో తట్టుకోలేకనే బాధాతప్త హృదయంతో ఈ లేఖను రాస్తున్నాను. అర్ధంతరంగా నా యాత్రను ఆపేయడం ద్వారా మీరు నాకు అప్రతిష్టను మిగిల్చారు. మీరు ఎవరి ఒత్తిళ్లకో తలొగ్గి నా యాత్రను నిలిపివేశారని అనిపిస్తోంది. కాంగ్రెస్ కోసం అంకితమై పని చేస్తున్న నాలాంటి వారిని ప్రోత్సహించాల్సిన మీరే ఇలా యాత్రను ఆపేయడం ద్వారా కాంగ్రెస్ కు ఎలా మేలు కలుగుతుందో అర్ధం కావడం లేదు. నా యాత్రను నిలిపివేయడం పార్టీ ప్రయోజనాలకు విఘాతం కలిగించడం కాదా, కాంగ్రెస్సే సర్వస్వం అనుకుని పని చేస్తున్న నన్ను ఇలా అవమానించడం ఎంత వరకు సమంజసం.

Read alsso:  Beer: జపాన్ బ్యాంక్ నుంచి ఫండ్‌రైజ్‌ చేసిన ‘బిరా 91’

నేను తలపెట్టిన తెలంగాణ పోరు యాత్ర పార్టీలోని కొందరికి కంటగింపుగా ఉన్నట్టు నాకనిపించింది. కాంగ్రెస్ లో నేను దశాబ్ద కాలానికి పైగా నిబద్దతతో పనిచేస్తున్నాను. నిర్మల్ ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను పార్టీ కోసం చేసిన సేవలు సహచర నేతలందరికీ సుపరిచతమే. నిర్మల్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారి పాదయాత్ర, రెండు సందర్భాల్లో రాహుల్ జీ పాల్గొన్న రెండు బహిరంగ సభలు, ఆ తర్వాత ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ గారు పాల్గొన్న మరో పబ్లిక్ మీటింగ్ వంటి కార్యక్రమాలనిర్వహణలో నా కృషి ఏంటో హై కమాండ్ నుంచి జిల్లా స్ధాయి వరకు నేతలందరికీ తెల్సిందే. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల ప్రజా చైతన్య యాత్ర కన్వీనర్ గా 32 బహిరంగ సభల నిర్వహణలో నా వంతు పాత్ర కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు తెల్సిందే. ఇలా తెలంగాణ పిసిసికి ఎవరు అధ్యక్షులుగా ఉన్నా, నేను మాత్రం నిబద్దతతో, అంకిత భావంతో పార్టీ కోసం నిరంతరం పనిచేసాను. పార్టీలో నాకు జరిగిన కొన్ని అవమానాలు , పరాభవాలను పట్టించుకోకుండా తెలంగాణలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావాలనే ఏకైక అజెండాతో ఓ సైనికుడిలా పనిచేసానని గర్వంగా చెప్పగలను.

Read alsso:  Payyavula Keshav: గవర్నర్ ప్రసంగంలో 3 రాజధానుల అంశం ఎందుకు లేదు..?

కాంగ్రెస్ బలోపేతం కోసం ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు తెలంగాణ పోరు యాత్ర పేరుతో నేను చేపట్టిన కార్యక్రమాన్ని మీరు రద్దు చేసుకోవాలని మీరు ఆదేశించడం, అదే సమయంలో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క గారు హాత్ సే హాత్ జోడో యాత్రను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నిర్వహిస్తానంటూ ముందుకురావడం, సహకరించాలని నన్ను కోరడంతో నేను నా యాత్రను భట్టి గారి యాత్రలో విలీనం చేస్తున్నట్టు, ఈ యాత్రను ఆయన కొనసాగిస్తారని ప్రకటించాల్సి వచ్చింది. నా యాత్రను మీరు ఉన్న పళంగా అకారణంగా రద్దు చేసిన అంశం వివాదం కావొద్దనే సదుద్దేశంతో నేను భట్టి విక్రమార్క గారి యాత్రకు సహకరిస్తున్నట్టు ప్రకటించాను. అయితే నాయాత్రను ఆపేయాలన్న మీరు అదే సందర్భం లో ఇతర సీనియర్లు కూడా యాత్రలు చేస్తారని చెప్పడం వెనకున్న మతలబేంటి, మరి విజయవంతంగా సాగుతున్న నా యాత్రను అర్ధంతరంగా ఎందుకు నిలిపివేసినట్టు, ఇంతలా నన్ను అవమానించడం ఎంత వరకు సమంజసం? హాత్ సే హాత్ జోడో అభియాన్ అనేది ఏఐసిసి రూపొందించిన ప్రోగ్రామ్. ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ గా తెలంగాణలో హాత్ సే హాత్ జోడో యాత్రలను పర్యవేక్షించాల్సింది నేనే.

Read alsso:  Aswani Dutt: రోషన్ ను ‘ఛాంపియన్’ చేస్తానంటున్న సీనియర్ నిర్మాత!

అలాంటి బాధ్యతలో ఉన్న నన్ను, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ అయినే మీరే అడ్డుకోవడమేంటి? కాంగ్రెస్ ఇమేజ్ ను బలోపేతం చేసేందుకు పార్టీ జెండా పట్టుకుని యాత్ర చేస్తున్నానే తప్ప కొందరిలా సొంత ప్రతిష్ట పెంచు కోవాలనే అజెండాతో కాదే, మరి అలాంటపుడు ఎందుకని నా యాత్రను ఆపేయాలన్నారు? ఏఐసిసి ప్రోగ్రామ్స్ అమలు విషయంలో నన్ను బైపాస్ చేస్తూ, అవమానిస్తున్న అంశాన్ని నేను మీ దృష్టికి తీసుకొచ్చాను. అయితే జరుగుతున్న లోపాలను సరిచేయాల్సిన మీరే అవేమీ పట్టించు కోకుండా ఏక పక్షంగా వ్యవహరించడం ఎంత వరకు సమంజసం. పదవులు నాకు ముఖ్యం కాదు, ప్రజా సేవే నా లక్ష్యం. ఇది నాకు తాత, తండ్రి నుంచి వచ్చిన రక్తగత లక్షణం. ఆత్మాభిమానాన్ని చంపుకుని అవమానాలు, భరిస్తూ పనిచేయడం నా విధానం కాదు. నేను లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇస్తారని ఆశిస్తున్నని లేఖలో పేర్కొన్నారు.
Pawan Kalyan Varahi Live: జనసేన వారాహి ర్యాలీ లైవ్

Show comments