NTV Telugu Site icon

Gongidi Sunitha: మసీదులు, గోరీలు తొవ్వుతా అంటే ఇలాగే జరుగుద్ది.. బండిపై ఎమ్మెల్యే హాట్ కామెంట్

Gongidi Sunetha

Gongidi Sunetha

Gongidi Sunitha: మసీదులు తొవ్వుతా , గోరీలు తొవ్వుతా అంటే ఇలాగే ఉంటదని బండి సంజయ్ పై ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత హాట్ కామెంట్ చేశారు. యాదాద్రి జిల్లా గుండాల మండలంలోని బూర్జుబావి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గొంగిడి సునీత శంకుస్థాపన చేశారు. యాదాద్రిలో తొండి ప్రమాణం చేసాడు కాబట్టే బండి సంజయ్ తన అధ్యక్ష పదవిని కోల్పోయాడు అని అన్నారు. మసీదులు, గోరీలు తొవ్వుతా అంటే ఇలాగే జరుగుద్ది అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read also: Supreme Court: తీస్తా సెతల్వాద్‌ మధ్యంతర బెయిల్‌19 వరకు పొడిగింపు: సుప్రీంకోర్టు

తెలంగాణ బీజేపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత కొన్ని రోజుల నుంచి అధ్యక్ష పదవిపై జరుగుతున్న ప్రచారాలు నిజం కావడంతో సంచలనంగా మారింది. అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను తొలగించి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా నియమించారు. దీంతో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేశారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయిన అనంతరం.. బండి సంజయ్ తన రాజీనామాను ప్రకటించారు. మరికొన్ని నెలల్లోనే ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో.. అధ్యక్ష పదవికి సంబంధించి మార్పులు చేయడం వెనుక గల కారణాలేంటో బండి సంజయ్‌కి జేపీ నడ్డా వివరించారు. ఇకపై ఆయన సేవల్ని పార్టీ పెద్దలు కేంద్రంలో వినియోగించుకోనున్నట్టు తెలిసింది.
Harish Rao: అది నోరా మొరా.. రాహుల్ గాంధీపై మంత్రి హరీష్ రావు ఫైర్