Ugravai village: సాధారణంగా ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఆ అన్యాయాన్ని ఎదిరించడానికి అందరూ కలిసి ఓ సంఘాన్ని ఏర్పరచుకుంటారు. ఆలా ఏర్పడిన సంఘాలు చాలానే ఉన్నాయి. మహిళా సంఘం, విద్యార్థి సంఘం, కార్మిక సంఘం ఇలా అనేక సంఘాలు ఉన్నాయి. కానీ జీవితాంతం పిల్లల కోసం అహర్నిశలు శ్రమిచ్చి.. వాళ్ళకి ఓ మంచి జీవితాన్ని అందించి చివరికి కదల లేని వృధాప్య స్థితిలో పిల్లలు చేరదీయ్యని తల్లిదండ్రుల తరుపున న్యాయం కోసం పోరాడే సంఘాలు చరిత్రలో లేవు . కానీ ఆ చరిత్రను తిరగ రాస్తూ ఓ వృద్దుల సంఘం ఏర్పడి. వివరాలలోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపం లోని ఉగ్రవాయి గ్రామంలో ఈ ఘనత చోటు చేసుకుంది. 9 సంవత్సరాల క్రితం కన్న కోడలు చేత నిర్ధాక్షిణంగా ఇంట్లో నుండి గెంటివేయబడ్డాడు కుర్మ రాజయ్య అనే వృద్ధుడు. ఈ నేపథ్యంలో ఆ గ్రామం లోని సదరు వృధులతో కుర్మ రాజయ్య తన బాధను పంచుకున్నారు.
Read also:PM Modi: రెండ్రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్‌కు మోడీ.. 5800కోట్ల పనులకు శంకుస్థాపన
ఇదే పరిస్థితిని గ్రామంలోని నందికంటి మల్లయ్య, జల్లా గంగయ్య, లింగయ్య అనే వృద్ధులు కూడా ఎదుర్కొన్నారు. దీనితో వీరంతా కలిసి కామారెడ్డి లోని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుని వద్దకు వెళ్లారు. అనంతరం ఆయన సలహా మేరకు గ్రామ సమీపం లోని చుట్టు పక్కల గ్రామాల్లో ఇంటి నుండి గెంటివేయబడ్డ వృద్దుల గురించి తెలుసుకుని వారంతా కలిసి రాజరాజేశ్వర వృద్ధుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 10 మందితో మొదలైన ఈ సంఘంలో ప్రస్తుతం 90 మంది ఉన్నారు. వీరంతా కలసి ప్రతి నెల స్తోమతకు తగ్గట్టు రూ/10 నుండి రూ/50 వరకు పొదుపు చేసుకుంటున్నారు. అలానే ఎవరైనా తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా వేధిస్తుంటే ఈ సంఘ సభ్యులు ఆ కొడుకుల దగ్గరకు వెళ్లి కౌన్సిలింగ్ ఇస్తారు. వినకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ సంఘం ఏర్పడినప్పటి నుండి తల్లిదండ్రులను వేధింపులకు గురిచేసే ఘటనలు చాలావరకు తగ్గినవి. ప్రస్తుతం వీరంతా కలసి ఓ భవనాన్ని నిర్మించుకుంటున్నారు.