Akhilesh Yadav Speech In Khammam BRS Party Public Meeting: కేంద్రంలో ఉన్న బీజేపీకి ఇక మిగిలింది కేవలం 399 రోజులేనని, ఆ పార్టీ కౌంట్‌డౌన్ మొదలైందని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ సభలో ఎటు చూసినా జనమే కనిపిస్తున్నారని, ఇలాంటి చారిత్రాత్మక నేలపై ఈ జనాన్ని చూస్తుంటే సంతోషంగా ఉందని అన్నారు. ఇంత మంది ముందు సందేశం ఇవ్వడానికి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన అఖిలేశ్.. ఈ సభకు వచ్చిన జనమే దేశానికి సంకేతం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మాణం.. ప్రజా సమస్యలకు పరిష్కారంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
Pinarayi Vijayan: రాజ్యాంగాన్ని కాపాడేందుకు.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలి
దేశంలోని అన్ని సంస్థలను బీజేపీ నిర్వీర్యం చేస్తోందని.. కేంద్రం ఢిల్లీలో కూర్చోని ఒక్కొక్క రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తోందని అఖిలేశ్ ఆరోపించారు. 400 రోజుల్లో కేంద్ర సర్కార్ ఉండదని, ఇవాళ్టితో ఆ ప్రభుత్వానికి ఇంకా 399 రోజులు మాత్రమే మిగులున్నాయని అన్నారు. కిసాన్ డిమాండ్లను బీజేపీ ప్రభుత్వం తీర్చడం లేదని.. రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపు చేస్తామని చెప్పి బీజేపీ విఫలమైందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని వెళ్లగొట్టేందుకు ఇక్కడ నుంచి ప్రయత్నాలు జరగాలన్నా ఆయన.. తెలంగాణలో బీజేపీకి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. యూపీ నుంచి కూడా ఆ పార్టీని వెళ్లగొడుతామన్నారు. తెలంగాణలో మిషన్ భగీరథ పథకం అద్భుతమని.. తెలంగాణ ప్రవేశపెట్టిన పథకాలను కేంద్రం కాపీ కొడుతోందని అన్నారు. బీజేపీయేతర రాష్ట్రాలను కేంద్రం ఇబ్బంది పెడుతోందని, విపక్ష పార్టీల నేతలను కేసుల పేరుతో ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది, దర్యాప్తు సంస్థలను చూపి భయపెట్టాలని చూస్తోందని మండిపడ్డారు.
Secretariat Dharma Case: చనిపోయి, బతికిన ధర్మా.. ట్విస్టులు రివీల్ చేసిన ఎస్పీ
బీజేపీ భ్రమలు కల్పించే పార్టీ అని, ఆ పార్టీతో చాలా జాగ్రత్తగా ఉండాలని అఖిలేశ్ సూచించారు. బీజేపీకి వ్యతిరేకంగా దక్షిణాది నుంచి మొదలైన ఈ ఉద్యమం.. సరికొత్త చరిత్ర సృష్టిస్తుందన్నారు. కలిసి పనిచేస్తే దేశానికి కొత్త మార్గదర్శకత్వం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రగతిశీల నేతలందరూ ఒక్కటి కావాలన్నారు. యాదాద్రి ఆలయ నిర్మాణాన్ని ప్రశంసించిన అఖిలేశ్.. విష్ణు అవతారమైన నర్సింహాస్వామి ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించారన్నారు. అయినా ఆ స్థాయిలో ప్రచారం చేసుకోలేదన్నారు. కానీ కొందరు ఆలయం కట్టకముందే.. దాని గురించి ఎక్కువ ప్రచారం చేస్తున్నారని బీజేపీపై విమర్శలు సంధించారు.
NTR: ఇంగ్లీష్ యాస పై ట్రోల్స్.. ఎన్టీఆర్ దిమ్మ తిరిగే కౌంటర్