NTR: ఇంగ్లీష్ యాస పై ట్రోల్స్.. ఎన్టీఆర్ దిమ్మ తిరిగే కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు చాలా భాషలు వచ్చు అని అందరికి తెల్సిందే. చెన్నై వెళితే తమిళ్ మాట్లాడతాడు. ముంబై వెళ్తే హిందీ, కర్ణాటకలో కన్నడ.. కేరళ వెళితే మలయాళం.. ఇక అచ్చ తెలుగు అనర్గళంగా మాట్లాడగలడు. ఇక ఈ మధ్యనే ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డును అందుకున్న విషయం తెల్సిందే. ఆ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడిన ఇంగ్లీష్ నెట్టింట వైరల్ గా మారింది. అమెరికన్ యాసలో మాట్లాడదామని ట్రై చేసి ఎన్టీఆర్ బొక్క బోర్లా పడ్డాడని, అది అమెరికన్ యాస అని ఎవరైనా అంటారా..? రాకపోతే రానట్లు ఉండాలి కానీ, ఇలా వచ్చిన్నట్లు బిల్డప్ ఇవ్వడం ఎందుకు అంటూ ట్రోలర్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
Vamsi Paidipally: ఎవడ్రా సీరియల్ ను తక్కువ చేసి మాట్లాడింది.. మీకు తెలుసా వారి కష్టం
ఇక ఈ ట్రోల్స్ కు, ట్రోలర్స్ కు ఎన్టీఆర్ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఓకే ఇంగ్లిష్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ” దేశానికి ఒక్కో భాష.. ఆ భాషకు యాస ఉంటుంది. ఎవరి భాష వారిది.. ఎవరి యాస వారిది. కాలమానం, యాసల పరంగానే మన మధ్య వ్యత్యాసం ఉంటుంది. కానీ, నటుడు ఎక్కడ ఉన్నా నటుడే.. అక్కడ ఉన్న నటులు ఎలా ఉంటారో.. ఇక్కడ ఉన్నవారు కూడా అదే విధానాన్ని అవలంబిస్తాడు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. నటుడు అనేవాడు ఎక్కడ ఉన్నాడు.. ఎలాంటి భాషను మాట్లాడుతున్నాడు అనేది కాకుండా యాస బాలేదు.. అని మన తెలుగువారే ఇలా ట్రోల్ చేయడం పద్దతికాదని ఎన్టీఆర్ అభిమానులు చెప్పుకొస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
-
India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
-
India Post GDS : పదో తరగతితో పోస్ట్ఆఫీస్ జాబ్.. 25 వేలకుపైగా పోస్టులు
-
Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!