Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Akhil Parents Demand That Akhil Goud Be Severely Punished

Hyderabad: అఖిల్‌గౌడ్ ను కఠినంగా శిక్షించండి.. అఖిల పేరెంట్స్ డిమాండ్

Published Date :May 30, 2024 , 11:27 am
By Bhanu
Hyderabad: అఖిల్‌గౌడ్ ను కఠినంగా శిక్షించండి.. అఖిల పేరెంట్స్ డిమాండ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రేమికుడి వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు ఆరు పేజీల సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు గుర్తించి విచారణ చేపట్టారు. హైదరాబాద్ న్యూ ఎల్‌బీ నగర్‌లో ఈ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.

జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని న్యూ ఎల్‌బీ నగర్‌లో నివాసముంటున్న కుమార్‌ కుమార్తె అఖిల(22) ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. అయితే మే 28వ తేదీ మంగళవారం రాత్రి హఠాత్తుగా ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోరగంటి ప్రాంతానికి చెందిన అఖిల్ సాయిగౌడ్ ప్రేమ పేరుతో అఖిలను వెంటాడి వేధించాడు. తన ప్రేమను అంగీకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఇక తప్పని పరిస్థితి కారణంగా అఖిల అతనితో తన ప్రేమను ఒప్పుకుంది. ఇదే విషయాన్ని వారి కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. కూతురి కోరికను కాదనలేక అందరూ బంధువుల సమక్షంలో మాట్లాడడంతో కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు.

Read also: Dowry Harassment: పాలు విరిగాయి అని ప్రాణం పోయేలా కొట్టారు.. గదిలో బంధించి దాడి

ఇంతవరకు బాగానే ఉన్నా అఖిల్ సాయి గౌడ్ తన ప్రేమను ఒప్పుకున్నప్పటి నుండి అఖిలని చాలా ఇబ్బందుల్లో పడేసాడు. రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆమెపై శారీరక, మానసిక హింసకు గురిచేశాడు. అంతే కాకుండా ఫోన్‌లో కూడా వేధించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, బంధువులు అతడిని మందలించారు. కొన్నాళ్లుగా సాగిన వీరి ప్రేమ కారణంగా అఖిల్ సాయి పెళ్లికి నిరాకరించాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన అఖిల ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి కుమార్ ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read also: Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. ఏకంగా 1200 మంది..!

అఖిల తండ్రి కుమార్ మాట్లాడుతూ.. మా అమ్మాయి వెంట పడి మరి ప్రేమించాడన్నారు. ఎనిమిదేళ్ళుగా మా అమ్మాయితో ప్రేమలో ఉన్నాడన్నారు. వారిద్దరి ప్రేమ విషయం తెలిసి ముందు వద్దన్నామన్నారు. కాని, మా అమ్మాయి మీద ఉన్న ప్రేమతో పెళ్ళికి కూడా ఒప్పుకున్నామని తెలిపారు. ముందు ఇద్జరు లైఫ్ లో సెటిలవ్వండి తరువాత పెళ్ళి చేస్తామని చెప్పామన్నారు. కాని గత కొద్ది రోజులుగా పెళ్ళి చేసుకోమంటే మాత్రం అయిష్టంగా ఉన్నాడన్నారు. నాకు చాలా కట్నం వస్తుంది అని చెప్పేవాడన్నారు. అబ్బాయికి కట్నం ఆశ ఉన్నట్లుంది అని అనుకున్నామని తెలిపారు.

Read also: KTR Tweet: ఎంత అవమానం!! కేటీఆర్‌ ట్విట్‌ వైరల్

వేరే ఎవరికి ఇచ్చి పెళ్ళి చేసిన కట్నం ఇవ్వాల్సిందేగా, అదేదో మా అమ్మాయిని ప్రేమించిన వాడికే ఇస్తే సరిపోతుందని అనుకున్నామన్నారు. ఏమైందో తెలియదు కాని నిన్న సాయంత్రం అఖిల సూసైడ్ చేసుకుందన్నారు. గత నెల రోజులుగా డైరీ రాస్తుందని, చనిపోవడనికి ముందు సూసైడ్ నోట్ రాసిందన్నారు. డైరీ చదివినప్పుడు మా కూతురిని కొట్టాడని తెలిసిందన్నారు. నా కూతురి పై ఒక్కసారి కూడా చేయి చేసుకోలేదు, అల్లారుముద్దుగా పెంచుకున్నామని కన్నీరుమున్నీరుగా విలపించారు. అఖిల మృతికి కారణమైన అఖిల్‌గౌడ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

https://www.youtube.com/watch?v=m5j7s2jjdo8

Monsoon: నేటి నుంచి వర్షాకాలం ప్రారంభమైనట్టే.. నేడు,రేపు పొడివాతావరణం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akhil Goud
  • Akhil Goud severely punished
  • Akhil parents demand
  • Akhil parents demand that Akhil Goud be severely punished
  • Top Trending Topics

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions