ప్రేమికుడి వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు ఆరు పేజీల సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు గుర్తించి విచారణ చేపట్టారు. హైదరాబాద్ న్యూ ఎల్‌బీ నగర్‌లో ఈ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని న్యూ ఎల్‌బీ నగర్‌లో నివాసముంటున్న కుమార్ కుమార్తె అఖిల(22) ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. అయితే మే 28వ తేదీ మంగళవారం రాత్రి హఠాత్తుగా ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోరగంటి ప్రాంతానికి చెందిన అఖిల్ సాయిగౌడ్ ప్రేమ పేరుతో అఖిలను వెంటాడి వేధించాడు. తన ప్రేమను అంగీకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఇక తప్పని పరిస్థితి కారణంగా అఖిల అతనితో తన ప్రేమను ఒప్పుకుంది. ఇదే విషయాన్ని వారి కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. కూతురి కోరికను కాదనలేక అందరూ బంధువుల సమక్షంలో మాట్లాడడంతో కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు.
Read also: Dowry Harassment: పాలు విరిగాయి అని ప్రాణం పోయేలా కొట్టారు.. గదిలో బంధించి దాడి
ఇంతవరకు బాగానే ఉన్నా అఖిల్ సాయి గౌడ్ తన ప్రేమను ఒప్పుకున్నప్పటి నుండి అఖిలని చాలా ఇబ్బందుల్లో పడేసాడు. రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆమెపై శారీరక, మానసిక హింసకు గురిచేశాడు. అంతే కాకుండా ఫోన్‌లో కూడా వేధించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, బంధువులు అతడిని మందలించారు. కొన్నాళ్లుగా సాగిన వీరి ప్రేమ కారణంగా అఖిల్ సాయి పెళ్లికి నిరాకరించాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన అఖిల ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి కుమార్ ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. ఏకంగా 1200 మంది..!
అఖిల తండ్రి కుమార్ మాట్లాడుతూ.. మా అమ్మాయి వెంట పడి మరి ప్రేమించాడన్నారు. ఎనిమిదేళ్ళుగా మా అమ్మాయితో ప్రేమలో ఉన్నాడన్నారు. వారిద్దరి ప్రేమ విషయం తెలిసి ముందు వద్దన్నామన్నారు. కాని, మా అమ్మాయి మీద ఉన్న ప్రేమతో పెళ్ళికి కూడా ఒప్పుకున్నామని తెలిపారు. ముందు ఇద్జరు లైఫ్ లో సెటిలవ్వండి తరువాత పెళ్ళి చేస్తామని చెప్పామన్నారు. కాని గత కొద్ది రోజులుగా పెళ్ళి చేసుకోమంటే మాత్రం అయిష్టంగా ఉన్నాడన్నారు. నాకు చాలా కట్నం వస్తుంది అని చెప్పేవాడన్నారు. అబ్బాయికి కట్నం ఆశ ఉన్నట్లుంది అని అనుకున్నామని తెలిపారు.
Read also: KTR Tweet: ఎంత అవమానం!! కేటీఆర్ ట్విట్ వైరల్
వేరే ఎవరికి ఇచ్చి పెళ్ళి చేసిన కట్నం ఇవ్వాల్సిందేగా, అదేదో మా అమ్మాయిని ప్రేమించిన వాడికే ఇస్తే సరిపోతుందని అనుకున్నామన్నారు. ఏమైందో తెలియదు కాని నిన్న సాయంత్రం అఖిల సూసైడ్ చేసుకుందన్నారు. గత నెల రోజులుగా డైరీ రాస్తుందని, చనిపోవడనికి ముందు సూసైడ్ నోట్ రాసిందన్నారు. డైరీ చదివినప్పుడు మా కూతురిని కొట్టాడని తెలిసిందన్నారు. నా కూతురి పై ఒక్కసారి కూడా చేయి చేసుకోలేదు, అల్లారుముద్దుగా పెంచుకున్నామని కన్నీరుమున్నీరుగా విలపించారు. అఖిల మృతికి కారణమైన అఖిల్‌గౌడ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Monsoon: నేటి నుంచి వర్షాకాలం ప్రారంభమైనట్టే.. నేడు,రేపు పొడివాతావరణం