Puvvada Ajay Kumar: కొందరు నాయకులు స్వార్థం కోసం కేసీఆర్ చెయ్యి వదిలి పెట్టారు. ఆ..నాయకులందరు శంకరగిరి మాన్యాలకు పోక తప్పదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో పది స్థానాల్లో ఎట్లా అసెంబ్లీ గేట్లను తాకుతారో మనం చూద్దామని సవాల్ విసిరారు. స్వార్థం కోసం బీఆర్‌ఎస్ నూ బొంద పెడతం అనే వారికి కేడర్ సవాల్ విసరాలన్నారు. జిల్లాలో పది స్థానాలలో గెలువనివ్వమని పొంగులేటి, ఉత్తర కుమర్ పగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు శాపాలు పెట్టేవారు అప్పుడు నన్ను గెలిపించడం కోసం కృషి చేయలేదన్నారు. బీఆర్‌ఎస్ పార్టీనీ భూస్థాపితం చేస్తామనే వారు కొంతమంది ప్రగల్భాలు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలకోట్ల కాంట్రాక్ట్ లు తీసుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు సగర్వంగా ఓట్లు అడిగే విధంగా చేస్తున్నానని తెలిపారు. నటిస్తే ప్రజలు అభిమానించరని అన్నారు. అందుబాటులో వున్న నాయకులకే ప్రజలు మద్దతు ఇస్తారని అన్నారు.
Read also: Uttam Kumar Reddy: ఉత్తమ్ కు సూర్యాపేట ఎస్పీ ఫోన్.. దీక్ష వాయిదా వేసుకోవాలని సూచన
కాకరకాయ కూడా పంచని నాయకులు ఇప్పుడు వారు ఏదో చేస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. నేను ప్రజలకోసం కడుపు కట్టుకుని ఎంతో సేవ చేశానని, మరి నన్ను ఎందుకు అసెంబ్లీ కి పంపరు అని అన్నారు. చిల్లర వాళ్ళు చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగు పార్టీల కూటమి గత ఎన్నికల్లో కలిపారు ఏమి చేయలేక పోయారని ఎద్దేవ చేశారు. ప్రగతి శీల శక్తులు ఇప్పుడు కేసీఆర్ పక్షాన వున్నాయని అన్నారు. కాంగ్రెస్ , బీజేపీలకు సిద్దాంతం వుందని, జైళ్లలో చిప్ప కూడు తిన్న వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. నాయకులు స్వార్థం కోసం కేసీఆర్ చెయ్యి వదిలి పెట్టిన వారంతా శంకరగిరి మాన్యలకు పొక తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడో సారి కూడా కేసీఆర్ సీఎం అవుతారని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఖమ్మం జిల్లాలో బాగుండటం కొంతమందికి ఇష్టం లేదన్నారు. రెండు మూడు వందలు, మటన్ బిర్యానీల కోసం వచ్చే వాళ్ళు బీఆర్‌ఎస్ క్యాడర్ కాదన్నారు. ఖమ్మం మీద చాలా మంది కన్ను పడిందని, వాళ్ళ కళ్ళు పడకుండా ఖమ్మంను రక్షించేలా ఆంజనేయ స్వామి విగ్రహం పెడుతున్నామని తెలిపారు.
Kishan reddy vs Harish rao: ఎంఎన్ జే కొత్త బ్లాక్ ఓపెన్ చేసి.. మధ్యలోనే వెళ్లిపోయిన కిషన్ రెడ్డి