AIMIM Big Plan: ఎంఐఎం అంటే.. హైదరాబాద్ ఓల్డ్ సిటీ పార్టీ.. పాత బస్తీకే పరిమితమైన పార్టీ.. కొత్త నగరంలో ఏ మాత్రం ప్రభావితం చూపించలేని పార్టీ.. ఇక, రాష్ట్రవ్యాప్తంగా చెప్పుకోదగిన స్థాయిలో దాని ప్రభావం ఉండదని చెబుతారు.. కానీ, ఇది నిన్నటి వరకే.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. తెలంగాణ వ్యాప్తంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది.. రాష్ట్రంలో ఏకంగా 50 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతోంది.. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ.. ఎంఐఎంకు ఏడుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని మంత్రి కేటీఆర్ అన్నారు.. కేటీఆర్ మాటలను పరిగణలోకి తీసుకుంటాం.. మా పార్టీ అధ్యక్షునితో మాట్లాడి రాష్ట్రంలో ఎక్కువ సీట్లలో పోటీ చేసే ప్రయత్నం చేస్తాం.. వచ్చే అసెంబ్లీలో కనీసం 15 మంది ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉండేలా చూస్తామంటూ ప్రకటించారు.. అసెంబ్లీలో బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య వాడీవేడీగా చర్చ సాగింది.. కేటీఆర్ వ్యాఖ్యలను ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఒవైసీ సీరియస్ గా తీసుకున్నారు. మీకున్నదిన్న ఏడుగురు ఎమ్మెల్యేలే మరి ఎంత సమయం ఇస్తారు? అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను అక్బరుద్ధీన్ సీరియస్ గా తీసుకున్నారు. మీకున్నది ఏడుగురు ఎమ్మెల్యేలే అంటూ తక్కువ చేసి మాట్లాడతారా? సమస్యల్ని అసెంబ్లీలో మాట్లాడటానికి సరిపడా సమయం కూడా ఇవ్వరా? అయితే వచ్చే ఎన్నికల్లో 15మంది ఎమ్మెల్యేలతో అడుగుపెడతాం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఒవైసీ..
Read Also: Akbaruddin Owaisi : అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన ప్రకటన
అయితే, అసెంబ్లీలో మాట్లాడటానికి సమయం తక్కువ ఇస్తున్నారని.. సమస్యల గురించి ప్రస్తావించటానికి కూడా సమయం సరిపోవటంలేదని కాబట్టి మాకు సమయం సరిపడా ఇవ్వాలని స్పీకర్ ని కోరారు అక్బరుద్ధీన్ ఒవైసీ. దానికి మంత్రి కేటీఆర్ మీకున్నది ఏడుగురు ఎమ్మెల్యేలే.. మరి ఎంత సమయం ఇస్తారు? అని అనడంతో.. అక్బరుద్ధీన్ వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 50 స్థానాల్లో పోటీ చేస్తామని 15మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగుపెడతాం అని స్పష్టంచేశారు. 50 స్థానాల్లో పోటీ చేయటానికి మా పార్టీ అధ్యక్షుడితో మాట్లాడతామని అని తెలిపారు.. కాగా ఈరోజు అసెంబ్లీలో గవర్నర్ పై ధన్యవాద తీర్మానం సందర్భంగా బీఆర్ఎస్-ఎంఐఎం మధ్య మాటల యుద్ధం నడిచింది. ఎమ్మెల్యే అక్బరుద్ధీన్, మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. అసెంబ్లీలో హామీలు ఇస్తారు.. కానీ, వాటిని అమలు చేయరు అంటూ అక్బరుద్ధీన్ విమర్శించారు. సీఎం గానీ, మంత్రులు గానీ మమ్మల్ని కలవరు బీఏసీలో ఇష్టమొచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటారని 25 ఏళ్లలో ఇటువంటి సభను చూడలేదంటూ అక్బరుద్ధీన్ విమర్శించారు. ఇక పాతబస్తీకి మెట్రో సంగతేంటి?. ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి ఏంటని అక్బరుద్దీన్ అంటూ ప్రశ్నించారు.
Read Also: Kohli vs Rohit: కోహ్లీ, రోహిత్ మధ్య గొడవలు నిజమే: మాజీ కోచ్ శ్రీధర్
కాగా, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు ఎంఐఎంకు మధ్య మంచి సంబంధాలున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో టీఆర్ఎస్ మెజార్టీ సీట్లు సాధించిన తర్వాత.. కేసీఆర్‌కు దగ్గరయ్యారు ఎంఐఎం నేతలు.. అన్నింటికీ మద్దతు ఇస్తూ వచ్చారు.. అయితే, టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారిన తర్వాత కాస్త గ్యాప్ వచ్చిందనే చర్చ సాగుతోంది.. ఇప్పుడు అసెంబ్లీ వేదికగానే రెండు పార్టీల మధ్య చర్చ వాడీవేడీగా సాగింది.. ఇదే సమయంలో.. 50 స్థానాల్లో పోటీ చేస్తాం.. కనీసం 15 మంది సభలో ఉండేలా చూసుకుంటామనంటూ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి. అయితే, ఎంఐఎం.. బీఆర్ఎస్ పొత్తుతోనే 50 స్థానాల్లో పోటీ చేస్తుందా? అయినా.. కేసీఆర్.. ఎంఐఎంకు 50 స్థానాలు ఎలా కేటాయిస్తారు? అనేది సంచలనంగా మారింది.. చిన్న ఒవైసీ స్టేట్‌మెంట్ ఇచ్చినా.. పెద్ద ఒవైసీ.. అంటే ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎలాంటి స్టెప్ తీసుకుంటారు.. అసలు ఎంఐఎం రానున్న ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
